నితిన్ కు రెమ్యునరేషనే ఇవ్వలేదట!

no remuneration for nithin
Highlights

నితిన్ కెరీర్ కి ఈ సినిమా సక్సెస్ చాలా ముఖ్యం. అందుకే ఈ సినిమా విషయంలో రెమ్యునరేషన్ పెద్దగా పట్టించుకోలేదట. పైగా 'ఛల్ మోహనరంగ' సినిమా లెక్కలు ఇంకా తేలలేదని, సెటిల్ మెంట్లు పోగా మిగిలిన మొత్తం పెద్దగా లేదని అందుకే నితిన్ కి రెమ్యునరేషన్ ఇవ్వలేదని అంటున్నారు

హీరో నితిన్ నటించిన 'శ్రీనివాస కళ్యాణం' సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సతీష్ వేగ్నేశ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు తన సొంత బ్యానర్ లో నిర్మించారు. అయితే ఈ సినిమాకు గాను దిల్ రాజు హీరోకి రెమ్యునరేషన్ ఇవ్వలేదని సమాచారం. కొందరు నితిన్ తీసుకోలేదని అంటుంటే మరికొందరు మాత్రం దిల్ రాజు ఇవ్వలేదని అంటున్నారు. అసలు విషయంలోకి వస్తే.. నితిన్ గత చిత్రం 'ఛల్ మోహనరంగ' రిలీజ్ విషయంలో దిల్ రాజు సహాయం అందించారు.

కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. అదే సమయంలో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి తన కొడుకుకి ఓ హిట్ సినిమా ఇవ్వాలని దిల్ రాజుని అడిగాడు. ఇచ్చిన మాట ప్రకారం దిల్ రాజు.. నితిన్ తో శ్రీనివాస కళ్యాణం సినిమా చేశారు. నితిన్ కెరీర్ కి ఈ సినిమా సక్సెస్ చాలా ముఖ్యం. అందుకే ఈ సినిమా విషయంలో రెమ్యునరేషన్ పెద్దగా పట్టించుకోలేదట. పైగా 'ఛల్ మోహనరంగ' సినిమా లెక్కలు ఇంకా తేలలేదని, సెటిల్ మెంట్లు పోగా మిగిలిన మొత్తం పెద్దగా లేదని అందుకే నితిన్ కి రెమ్యునరేషన్ ఇవ్వలేదని అంటున్నారు.

ఇటీవల ఈ సినిమాకు వేసిన స్పెషల్ షోతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. యునానిమస్ గా సినిమా బాగుందని చెప్పడం విశేషం. ఆగస్టు 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

loader