ఆల్ ఇండియా స్థాయిలో, ఓపెనింగ్ డే రోజున.. కొత్త రికార్డులు సృష్టించే సత్తా కేజీఎఫ్ 2కి ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ఓవర్ సీస్ లో ఈ చిత్రం పై ఎలాంటి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయనే దృష్టి పెట్టింది ట్రేడ్. అయితే ఆశ్చర్యంగా అక్కడ ఊహించని స్దాయిలో హైప్ కనపడటం లేదు.
మరి కొద్ది గంటల్లో కేజీఎఫ్ బొమ్మ థియోటర్ లో పడుతోంది. ఈ సినిమాపై భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అన్నీ కుదిరితే… తొలి రోజు వసూళ్లలో.. కేజీఎఫ్ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని… ట్రేడ్ వర్గాలు అంచనాలు ,లెక్కలు వేస్తున్నాయి. . అవ్వడానికి ఇది కన్నడ సినిమానే అయినా – అసలు సిసలు పాన్ ఇండియా సినిమా అంటున్నారు. కేజీఎఫ్ 1 దేశ వ్యాప్తంగా భారీ వసూళ్లను సాధించమే అందుకు కారణం. బాహుబలి తరవాత. ఆ స్థాయిలో బాలీవుడ్ ని షేక్ చేసిన సినిమా ఇది.
ఇప్పుడు కేజీఎఫ్ 2పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఆల్ ఇండియా స్థాయిలో, ఓపెనింగ్ డే రోజున.. కొత్త రికార్డులు సృష్టించే సత్తా కేజీఎఫ్ 2కి ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క్రమంలో ఓవర్ సీస్ లో ఈ చిత్రం పై ఎలాంటి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయనే దృష్టి పెట్టింది ట్రేడ్. అయితే ఆశ్చర్యంగా అక్కడ ఊహించని స్దాయిలో హైప్ కనపడటం లేదు.
మన తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఓపెనింగ్స్ పై చాలా అంచనాలు నెలకొన్నాయి. కానీ ఓవర్సీస్ లో తెలుగు వెర్షన్ కి మాత్రం అనుకున్నంత హైప్ లేనట్టు అక్కడ బుక్కింగ్స్ ని బట్టి అర్దమవుతోంది. మామూలు రెగ్యులర్ సినిమాలను మించి బుకింగ్స్ నమోదు అవుతున్నా RRR ని మించిన బుకింగ్స్ కానీ ఓ క్రేజీ సీక్వెల్ కి ఉండే హైప్ గాని అనుకున్న రేంజ్ లో కనిపించంలేకపోవటం ఆశ్చర్యపరుస్తోంది. ఈ పాటికే ఎప్పుడో 1 మిలియన్ ప్రీమియర్స్ బుకింగ్స్ జరిగిపోవాల్సి ఉంది కానీ ఇంకా ఆ మార్క్ కి రీచ్ కాలేదు. అలాగని మరీ నాశిగానూ లేవు. హిట్ టాక్ వస్తే మాత్రం సినిమా దుమ్ము దులుపటం ఖాయం.
లేటెస్ట్ గా ఇండియన్ బాక్సాఫీస్ ని మరోసారి షేక్ చేసేందుకు సమాయత్తం అవుతున్న భారీ చిత్రం “కేజీయఫ్ చాప్టర్ 2”. కన్నడ రాకింగ్ స్టార్ యాష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ సాలిడ్ యాక్షన్ డ్రామా కోసం ఆడియెన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా పట్ల ఒకింత ఒరిజినల్ కన్నడ ఆడియెన్స్ కంటే ఆడియెన్స్ నే చాలా ఆసక్తిగా ఉన్న సంగతి తెలిసిందే.
కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడ్డ కేజీఎఫ్ 2 చిత్రాన్ని ఎట్టకేలకు ఏప్రిల్ 14న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఇక ఈ సినిమాను చూసేందుకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్‌ను దేశవ్యప్తంగా నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్.
