ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కాదు ఇండియాలోనే క్రేజీయెస్ట్ హీరోల్లో  ప్రభాస్ ఒకరు. ప్రభాస్ తో సినిమా చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు వరసలో ఉన్నారు.   బాహుబలి తర్వాత ప్రభాస్ కి వచ్చిన ఫాలోయింగ్ అలాంటిది మరి. దాన్ని నిలబెట్టుకుంటున్నాడా లేదా అనే విషయం ప్రక్కన పెడితే వరస ప్రాజెక్టులతో బిజీ అయ్యాడు ప్రబాస్. వరసపెట్టి ప్యాన్ ఇండియన్ కథలు మాత్రమే చేస్తున్నాడు. సాహో సినిమా తెలుగులో ఫ్లాప్ అయినా హిందీలో హిట్ అవటం కాస్త ఉత్సాహాన్నీ ఇచ్చింది.తెలుగుకన్నా హిందీ మార్కెట్ నే నమ్ముకోవటం బెస్ట్ అనుకుంటున్నాడు. దాంతో   ఇప్పుడు రాధే శ్యామ్ సినిమాను కూడా తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. అయితే ప్రభాస్ మైండ్ పై మాత్రం సాహో రిజల్ట్ ఎఫెక్ట్ గట్టిగానే పడిందంటున్నారు.  

వాస్తవానికి సాహో రిలీజ్ అయ్యిన తర్వాత ప్రభాస్ బడ్జెట్ లు,రెవిన్యూలపై అందరి దృష్టీ పడింది. ఎంత పెడుతున్నాం..ఎంత రికవరీ ఉందనే విషయమై ఆచి,తూచి అడుగులు వేస్తున్నారు.  అదేకోవలో ఇప్పుడు ఆయన చేస్తున్న మూడు సినమా బడ్జెట్ లెక్కలు వేసారని తెలుస్తోంది. బాహుబలి హిట్టైన తర్వాత వచ్చిన క్రేజ్ తో సాహో సినిమా అంతకు మించి అనుకున్నారు కానీ ఆ మ్యాజిక్ జరగకపోవటమే ఈ నిర్ణయానికి కారణం అని తెలుస్తోంది. ప్రభాస్ చెప్పిన మేరకే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్తున్నారు. హిందీలో తప్ప సాహో అన్ని చోట్లా డిజాస్టర్ అయ్యింది. ఇది ఓ కనువిప్పు గా మారింది. తమకు మించిన  రిస్క్ తీసుకోవటం కూడా రిస్కే అని తేలింది. ఈ క్రమంలో నిర్మాతలు ఉత్సాహం చూపినా ప్రభాస్ స్వయంగా బడ్జెట్ లు అంత పెట్టద్దని సూచిస్తున్నారట. ఇది చూసి నిర్మాతలే ఆశ్చర్యపోతున్నారట. సాధారణంగా హీరోలు తమ రెగ్యులర్ బడ్జెట్ ని మించి ప్రతీసారీ నిర్మాతలను పెట్టమంటూంటారు. కానీ ప్రభాస్ అందుకు విరుద్దంగా ఉండటం జరుగుతోందంటున్నారు.
 
 ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న రాధేశ్యామ్ సినిమాకు బడ్జెట్ పెరుగుతుందనే ఉద్దేశ్యంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అక్కడకి తన రెమ్యునేషన్ గా తీసుకునే షేర్ ని చాలా తగ్గించుకున్నారట. మరో వైపు మైధిలాజికల్ ఫిల్మ్ ఆదిపురుష్ షూటింగ్ కు వారు చెప్పిన బడ్జెట్ ని సైతం తగ్గించమని చెప్పారట. చిన్న బడ్జెట్ లో విజువల్ వండర్ గా చేయమని ఎవరూ నష్టపోవద్దని ప్రభాస్ సూచించారట.
 
ఇక ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా కూడా కంఫర్ట్ బుల్ బడ్జెట్ ని దాటవద్దని చెప్పారట. అప్పటికీ అశ్వనీదత్..బడ్జెట్ విషయం నాకు వదిలేయ్ అన్నా సరే...తన మార్కెట్ ని మించి వెళ్లవద్దని ప్రభాస్ అన్నాడని చెప్పుకుంటున్నారు.