అభిమానుల్లో ఓ రేంజి క్రేజ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అని కళ్లు మూసుకు చెప్పేయవచ్చు. హిట్,ప్లాఫ్ లకు సంభంధం లేకుండా ఆయన సినిమాలను అభిమానులు ఆదరిస్తూంటారు. ఆయన ఫ్యాన్స్ అశోశియోషన్ లో సభ్యులు రోజు రోజుకూ పెరగటమే కానీ తగ్గటం జరగదు. అలాంటి పవన్ సరసన హీరోయిన్ గా చేయటానికి ఎవరూ దొరకటం లేదనే వార్త నిజంగా విచిత్రమే. అయితే పవన్ సరసన ఎవరిని పడితే వారిని తీసుకోలేరనేది నిజం. ఆ క్రమంలో స్టార్ హీరోయిన్స్ వేట మొదలెట్టింది టీమ్. 

అందుతున్న సమాచారం ప్రకారం ఈ కథలో కేవలం సెకండాఫ్ లో వచ్చే మాంటేజ్ లో మాత్రమే పవన్ కు హీరోయిన్ ఉంటుంది. దాంతో ఏ హీరోయిన్ అలా వచ్చి వెళ్లిపోయే పాత్ర చేయటానికి ఇంట్రస్ట్ చూపటం లేదట. అలాగని ఆ పాత్రను పూర్తిగా పెంచుదామంటే కథలో ఆ క్యారక్టర్ కు  ప్రాధాన్యత లేదు. ఎంత పెంచినా సోది లాగ ఉంటుందని తప్ప ఇంట్రస్టింగ్ గా ఉండదు. దాంతో దర్శక,నిర్మాతలు ఈ విషయమై ఏం చేయాలా అనే ఆలోచనలో పడ్డారట. ఏదో ఆశపెట్టి హీరోయిన్ ని తీసుకు వచ్చి ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా ఎక్సపెక్టేషన్స్ పెరుగుతాయని భావిస్తున్నారు. దాంతో తెరమీద అంతసీన్ హీరోయిన్ తో లేనప్పుడు పబ్లిసిటీలో కూడా చూపలేరు. ఇది స్టార్ హీరోయిన్స్ కు సమస్యే. దాని కన్నా బదులు చక్కగా అసలు ఆ ఎపిసోడే తీసేస్తే బెస్ట్ అని ఫిక్స్ అవుతున్నారు. మరి నిర్మాత దిల్ రాజు ఏమంటారో చూసి దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారట. పవన్ మాత్రం తాను స్క్రిప్టు లో డిస్కషన్స్ పెట్టనని, తనకంత టైమ్ లేదని క్లియర్ చేసి చెప్పారట. 

మరో ప్రక్క కరోనా వైరస్‍ (కోవిడ్‌-19) ఎఫెక్ట్‌  వరస పెట్టి సినిమాలపై పడుతోంది. చాలా సినిమా షూటింగ్  లు, రిలీజ్ లు వాయిదాలు పడుతున్నాయి. తాజాగా నాని సినిమాని సైతం వాయిదా వేసారు. అలాగే పవన్ సినిమాపై కూడా ఈ ప్రభావం పడనుందని సమాచారం.. ఈ మహమ్మారి కారణంగా  దిల్‌రాజే నిర్మిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమా `వ‌కీల్‌సాబ్‌` విడుద‌ల వాయిదా రూమ‌ర్ వినిపిస్తోంది. నిజానికి ఈ సినిమాని మే 15న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కానీ తాజాగా జూన్‌కి వాయిదా వేసిన‌ట్టు తెలుస్తోంది. షూటింగ్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కి మ‌రింత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశాలు ఉండ‌టంతో సినిమాని వాయిదా వేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు స‌మాచారం. దీనిపై కూడా క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.