బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'క్వీన్' సినిమాను దక్షిణాది భాషల్లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో 'దటీజ్ మహాలక్ష్మి' పేరుతో రూపొందించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తై చాలా కాలమావుతున్నా సినిమా మాత్రం రిలీజ్ కావడం లేదు.

ఆ మధ్య సినిమా ఫస్ట్ లుక్, టీజర్ అంటూ సందడి చేశారు. కానీ బిజినెస్ మాత్రం ఆశించిన స్థాయిలో జరగడం లేదట. అందుకే సినిమాను పక్కన పెట్టేశారని టాక్. తమన్నాకి సోలో హీరోయిన్ గా తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు. పైగా ఆమె నటించిన సినిమాలు ఈ మధ్య టాలీవుడ్ లో ఫ్లాప్ అయ్యాయి.

దీంతో 'దటీజ్ మహాలక్ష్మి' సినిమా జోలికి ఎవరూ వెళ్లడం లేదు. తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలో కూడా ఈ సినిమా పరిస్థితి అలానే ఉందట. తమిళ 'క్వీన్' రీమేక్ లో కాజల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా బయ్యర్లను ఆకర్షించలేకపోతుంది. 

ఇటు తమన్నా, అటు కాజల్ ఇద్దరికీ సోలో మార్కెట్ లేకపోవడంతో నిర్మాతలు ఇబ్బందుల్లో పడ్డారు. కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం ఇప్పటివరకు యాభై శాతం బిజినెస్ జరిగిందని సమాచారం. నాలుగు భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయాలనుకున్న దర్శకనిర్మాతల కోరిక ఇప్పుడు నెరవేరేలా కనిపించడం లేదు.