ఒకే ఒక్క సింగిల్ సీన్ తో దేశాన్ని మొత్తం ఒక ఊపు ఊపేసిన ప్రియా ప్రకాష్ వారియర్ ఏ రేంజ్ లో రచ్చ చేసిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఓరు ఆధార్ లవ్ సినిమాకు లోని ఆ సన్నివేశం సినిమాకు అప్పట్లో మంచి బజ్ క్రియేట్ చేసింది గాని ఇప్పుడు ఆ సినిమా గురించి పెద్దగా ఎవరు పట్టించుకోవడం లేదు. 

ఓరు ఆధార్ లవ్ తెలుగులో లవర్స్ డే గా ప్రేమికుల రోజు రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్స్ కూడా మొన్నటివరకు బాగానే చేశారు. ఏకంగా అల్లు అర్జున్ చేత ఆడియో రిలీజ్ చేయించిన చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ దగ్గరపడే సరికి లైట్ తీసుకున్నారనే చెప్పాలి. సినిమా ఎంతవరకు సక్సెస్ అందుకుంటుందో గాని ప్రస్తుతానికి క్రేజ్ అయితే ఏమి లేదు. 

మొదటి రోజు కలెక్షన్స్ ఏ రేంజ్ లో వస్తాయో చూడాలని అందరిలో ఆసక్తి రేగుతోంది. ఈపాటికి బుకింగ్స్ లో రచ్చ చేస్తుందన్న సినిమా ఇంకా ఆ ఖాతాను ఫుల్ ఫీల్ చేయలేకపోతోంది. గూగుల్ ని గత ఏడాది ఉక్కిరిబిక్కిరి చేసి టాప్ 1లో నిలిచిన ప్రియా వారియర్ క్రేజ్ ఎంతవరకు నిలిచిందో రేపటితో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో లెట్స్ వెయిట్ అండ్ సి..