మరో రెండు రోజుల్లో గోపిచంద్ రామబాణం, నరేశ్ ఉగ్రం చిత్రాలు రిలీజ్కు రెడీ అయ్యాయి. మరి ఈ రెండు చిత్రాలు ఎలాంటి విజయాన్ని అందుకుంటాయో?
సినిమా రిలీజ్ కు ముందు కావాల్సినంత బజ్ లేకపోతే ఓపినింగ్స్ రావటం లేదు. ఈ విషయం హీరో నుంచి డిస్ట్రిబ్యూటర్స్ దాకా అందరికీ తెలుసు. అందుకే ప్రమోషన్స్ గట్టిగా చేస్తూంటారు. కానీ ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న గోపీచంద్ ‘రామబాణం’ , అల్లరి నరేష్ ‘ఉగ్రం’ సినిమాలకు కావాల్సినంత బజ్ క్రియేట్ కావటం లేదు. ఎక్కడా ఈ సినిమా ఖచ్చితంగా చూడాలనిపించేటంత రియాక్షన్స్ లేవు. అప్పటికీ రెండు సినిమాలకు సంబందించి హీరోలిద్దరు ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఆడియన్స్ కి సినిమాను రీచ్ చేసే పనిలో ఉన్నారు. కానీ రెండు సినిమాలకు రావాల్సినంత బజ్ లేకపోవటం హీరోలనే కాదు డిస్ట్రిబ్యూటర్స్ ని టెన్షన్ లో పడేస్తోందని సమాచారం. అయితే బజ్ క్రియేట్ కాకపోవటానికి కారణం ఏమిటి..
ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న దాని ప్రకారం .. గోపీచంద్ సినిమా ట్రైలర్ రిలీజ్ కు ముందు దాకా ఓకే అనుకున్నా..అది చూసాక రొటీన్ అనే అనిపించింది. సినిమాలో విషయం అలాంటిదో లేక ట్రైలర్ కట్ మీద టీం పెద్దగా శ్రద్ద పెట్టలేదో కానీ సెట్ కాలేదు. దాంతో గోపీచంద్ మరింత ప్రమోషన్స్ ని పెంచమని టీమ్ పై ప్రెజర్ పెడుతున్నట్లు వినిపిస్తోంది. దర్శకుడు శ్రీవాసు వరస పెట్టి ఇంటర్వూలు ఇస్తున్నారు. కానీ సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి టాకే లేదు.
మరో ప్రక్క నరేష్ ‘ఉగ్రం’ గురించి బాగా చెప్తున్నారు. అయితే ట్రైలర్ చూసాక మరోసారి నాంది లాంటి కథతోనే వస్తున్నాడనిపించింది. అల్లరి నరేష్ ఇంటర్వూలు ఇస్తున్నా జస్ట్ ఓకే అన్నట్లు ఉన్నాయి. సినిమాకు కావాల్సిన ప్రమోషన్ దక్కి బజ్ రావటం లేదు. ఈ సినిమా సోలోగా వచ్చి ఉంటే కొంత ఓపెనింగ్స్ దక్కేవనే టాక్ వినపడుతోంది. గోపీచంద్ మాస్ హీరో సినిమా కాబట్టి ఉన్నంతంలో ఆ సినిమాకు ఓపినింగ్స్ బాగుంటాయంటున్నారు. మరో ప్రక్క ఉగ్రంకి లిమిటెడ్ థియేటర్స్ దక్కాయి.
ఇవి చాలదన్నట్లు బ్లాక్ బస్టర్ టాక్ తో ‘విరూపాక్ష’దూసుకుపోతోంది. రిలీజై ఇంతకాలం అయినా కూడా కొన్ని థియేటర్స్ లో ఉంది. ఈ క్రమంలో రామబాణం , ఉగ్రం రెండు సినిమాల బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. కానీ బుకింగ్స్ చాలా స్లోగా ఉన్నాయి. ఈ సమ్మర్ లో కనపడాల్సిన జోరు కనిపించడం లేదు. ఏదైమైనా సినిమాకు బాగుంది అనే టాక్ వస్తే ఒక్కసారిగా పికప్ అయ్యిపోతాయనటంలో సందేహం లేదు. కాబట్టి రిలీజ్ రోజు మార్నింగ్ షో టాక్ మీదే ఈ రెండు సినిమాల రిజల్ట్ ఆధారపడి ఉంది.
