Asianet News TeluguAsianet News Telugu

Nivetha Thomas : నివేదా థామస్ కాఫీ తాగే స్టైలే వేరు.. వైరల్ అవుతున్న వీడియో

తన అభినయంతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకున్న నివేదా థామస్ అప్పుడప్పుడు చిలిపి పనులూ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో అభిమానులకు ఎప్పడూ దగ్గరుండే నివేదా తాజాగా ఒక వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. 
 

Nivetha Thomas Drunk Coffee In Her Style, social media post.
Author
Hyderabad, First Published Jan 18, 2022, 5:00 PM IST

చైల్డ్ ఆర్టిస్ట్ గా తన  కేరీర్ ను ప్రారంభించిన ఈ తమిళ హీరోయిన్ ప్రస్తతం తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితం. ‘నివేదా థామస్’ తెలుగు అమ్మాయి అన్నట్టే భావిస్తారు. ప్రేక్షకుల ఆలోచనకు తగ్గట్టుగానే  నివేదా ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో సెటిల్ అయ్యింది. 2016 నుంచి వరుసగా తెలుగు చిత్రాల్లోనే నటిస్తూ వస్తోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరే ఇతర భాషల సినిమాల్లో నటించలేదు నివేదా. ఇప్పుడు తన ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు కూడా తెలుగు మూవీకి సంబంధించినట్టు గానే సమాచారం.  

తొలుత మలయాళం, తమిళ్ లో వరుసగా నటించినా నివేదాకు  టాలీవుడ్ లో సినిమాలు చేయడం ప్రారంభించడంతో ఎక్కువ మొత్తంలో గుర్తింపును సొంత చేసుకుంది నివేదా. అయితే 2008లో మలియాళంలో రిలీజైన ‘వెరుతె ఒరు భర్య’ మూవీలో ఫస్ట్ టైం చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన నివేదా అప్పుడే నటనలో తన మార్క్ ను చూపించింది. 

2016లో ‘జెంటిల్ మెన్’ (Gentlemen) నాని ( Nani) మూవీతో టాలీవుడ్  ఎంట్రీ ఇచ్చిందీ సొట్టబుగ్గల హీరోయిన్. వచ్చీరాగానే తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. అప్పటి నుంచి వరుసగా తెలుగు చిత్రాల్లోనే నటిస్తూ మరింత మంది ఫ్యాన్స్ ను తన ఖాతాలో జమ చేసుకుంటోంది నివేదా థామస్. కాగా ఎప్పుడూ వేరీ ఎనర్జిటిక్ అండ్ యాక్టివ్ గా ఉండే నివేదా అప్పుడప్పుడు కొన్ని చిలిపి పనులు చేస్తుంది. తాజాగా నివేదా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియోను చూస్తే అవుననే అనిపిస్తుంది. ఎంత పెద్ద హీరోయన్ అయినా ఆ సెలబ్రెటీ  స్టెటస్, స్టార్డమ్ ను పక్కనెట్టి తనకు నచ్చినట్టు ఉంటుంది. అందుకే కావొచ్చు ఈ హీరోయిన్ ఎక్కువగా తెలుగు ఆడియోన్స్ నచ్చింది.  

ఈ వీడియోలో ఓ రెస్టారెంట్ లో కాఫీ తాగుతుంది నివేదా. అయితే అందరూ మామూలుగా చేతులతో కప్ ను పట్టుకొని తాగితే, నివేదా మాత్రం వేరైటీగా  కప్ ను తాకకుండా కప్ ను నోటితో అందుకుని తాగింది. ఈ వీడియో చూసిన పలువురు థామస్ స్టైల్ ను పొగుడుతున్నారు. అయితే ఈ మీడియాకు ‘ క్లాసిక్ అండ్ కాఫీ’ అని క్యాప్షన్ పెట్టింది థామస్. 

 

రీసెంట్ గా పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ మూవీలో కనిపించిన నివేదా త్వరలో మరో రెండు సినిమాలతో మన ముందుకు రానుంది. షూటింగ్ జరుపుకుంటున్న ‘మీట్ క్యూట్’, ‘శాకిని డాకిని’ మూవీల్లో నివేదా ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు. శాకిని డాకిని మూవీలో ‘రెజినా కాసండ్రా’ (Regina Cassandra) తో కలిసి నటించనుంది నివేదా. 


 

Follow Us:
Download App:
  • android
  • ios