Asianet News TeluguAsianet News Telugu

అల వైకుంఠపురములో.. గ్లామర్ డోస్ పెంచిన నివేత

మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తమిళ్ బ్యూటీ నివేత పేతురాజ్. డిఫరెంట్ పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ మొన్నటి వరకు గ్లామర్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేసింది.

nivetha pethuraj special role in ala vaikuntapuramulo
Author
Hyderabad, First Published Sep 14, 2019, 10:36 AM IST

మెంటల్ మదిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తమిళ్ బ్యూటీ నివేత పేతురాజ్. డిఫరెంట్ పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ మొన్నటి వరకు గ్లామర్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేసింది.ఇక చిత్ర లహరి సినిమా అనంతరం ఈ బేబీకి తెలుగులో డిమాండ్ ఎక్కువగా పెరిగింది. 

అందుకే రెమ్యునరేష్ కూడా డబుల్ చేసి నిర్మాతలను బయపెడుతున్నట్లు ఓ టాక్ వైరల్ అవుతోంది. ఇక నెక్స్ట్ సినిమాల్లో పాత్రలను బట్టి బేబీ గ్లామర్ డోస్ గట్టిగానే ప్రజెంట్ చేయనున్నట్లు అర్ధమవుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురములో నివేత ఒక ముఖ్య పాత్రలో నటించడానికి ఒప్పుకుంది. అయితే ఆ పాత్రలో అమ్మడు ఫుల్ గ్లామర్ గా మెరవనున్నట్లు రీసెంట్ గా మీడియాకు తెలిపింది. 

గత సినిమాల్లో కంటే ఆ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని గ్లామర్ లో మాత్రం ఎవరు ఊహించని విధంగా వివరణ ఇచ్చింది. మరి ఇంతగా గ్లామరస్ పై స్పందిస్తున్న అమ్మడు ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios