నిన్నుకోరి సినిమాతో క్లిక్కయిన హీరోయిన్ నివేతా థామస్ ఆ తరువాత సౌత్ లో మంచి అవకాశాలను అందుకుంటూ కెరీర్ ను ఒక లెవెల్లో కొనసాగిస్తోంది. మిగతా భాషల్లో అమ్మడి రేంజ్ ఎలా ఉన్నా ఇక్కడ మాత్రం కాస్త స్ట్రగుల్ అవుతూనే ఉంది. ఎన్టీఆర్ జై లవకుశ సినిమా తరువాత 118 సినిమాలో నటించినప్పటికీ నివేత స్టార్ హీరోల దృష్టిలో పూర్తిగా పడటం లేదు. 

ఇక రీసెంట్ గా బేబీకి స్టార్ హీరోలతో నటించే అవకాశాలు మెల్ల మెల్లగా వస్తున్నాయని తెలుస్తోంది. అయితే అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో కూడా అమ్మడు ఒక ముఖ్య పాత్రలో కనిపించున్నట్లు ఇటీవల టాక్ వచ్చింది. అయితే ఈ విషయంపై నివేత స్పీడ్ గా క్లారిటీ ఇచ్చేసింది. 

తాను బన్నీ సినిమాలో నటించడం లేదని చెబుతూ.. ఇంతవరకు ఆ సినిమా గురించి నన్ను ఎవరు సంప్రదించలేదని నివేత వివరణ ఇచ్చింది. అయితే రెండు ప్రాజెక్టులు మాత్రం డిస్కర్షన్స్ లోఉన్నట్లు  బేబీ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం రజినీకాంత్ దర్బార్ సినిమాతో పాటు నాని - మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబోలో రానున్న V సినిమాలో నివేత నటిస్తోంది.