`భీమ్లా నాయక్‌` హీరోయిన్ నిత్యా మీనన్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె ఎంతగానో ప్రేమించే అమ్మమ్మ చనిపోయారు. ఈ సందర్భంగా ఆమె ఒక ఎమోషనల్‌ పోస్ట్ ని పంచుకున్నారు.

హీరోయిన్‌ నిత్యా మీనన్‌ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమెకి ఇష్టమైన తన అమ్మమ్మ చనిపోయారు. ఈ విషయాన్ని నిత్యా మీనన్‌ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. అమ్మమ్మతో ఉన్న ఫోటోని ఇన్‌ స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఆమె భావోద్వేగ పోస్ట్ పెట్టారు. ఇందులో నిత్యా మీనన్‌ చెబుతూ, `ఒక శకం ముగిసింది. మిమ్మల్ని చాలా మిస్సవుతున్నా. గుడ్‌ బై అమ్మమ్మ అండ్‌ మై చెర్రీ మ్యాన్‌. ఇప్పట్నుంచి మరో కోణంలో చూసుకుంటా` అని ఎమోషనల్‌ అయ్యింది నిత్యా మీనన్‌. 

నిత్యా మీనన్‌ పంచుకున్న ఫోటోలో అమ్మమ్మతోపాటు పక్కన తాతయ్య కూడా ఉన్నారు. నిత్యాని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుని ఏదో విషయం చెబుతుంది వాళ్ల అమ్మమ్మ. వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్‌కి ఈ ఫోటో నిదర్శనంగా చెప్పొచ్చు. తాను ఎంతగానో ప్రేమించే అమ్మమ్మ లేకపోవడంతో నిత్యా తీవ్ర విచారంలోకి వెళ్లిపోయింది. దీనిపై ఫ్యాన్స్ స్పందిస్తూ ధైర్యంగా ఉండాలని కామెంట్‌ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే నిత్యా మీనన్‌ ఇటీవల తెలుగులో `భీమ్లా నాయక్‌` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. పవన్‌కి జోడీగా మెరిసింది. రెబల్ యాటిట్యూడ్‌తో కనిపించి ఆకట్టుకుంది. ఇక `అలా మొదలైంది` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిందీ మలయాళ ముద్దుగుమ్మ. తొలి చిత్రంతోనే తెలుగు ఆడియెన్స్ మనసు దోచుకుంది. నితిన్‌తో `ఇష్క్`తో పెద్ద హిట్ అందుకుని స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. 

`గుండె జారిగల్లంతయ్యిందే` చిత్రంతో మరో హిట్‌ని ఖాతాలో వేసుకుంది. `మళ్లీ మళ్లీ ఇది రాణి రోజు` వంటి ఫీల్‌గుడ్‌ లవ్‌ స్టోరీలోనూ నటించి మెప్పించింది. `జబర్దస్త్`, `సన్నాఫ్‌ సత్యమూర్తి`, `రుద్రమదేవి`, `ఒక అమ్మాయి తప్ప`, `జనతా గ్యారేజ్‌`, `అ!`, `గీత గోవిందం`, `గమనం`, `స్కైలాబ్‌`, `భీమ్లా నాయక్` వంటి చిత్రాలు చేసింది. ప్రస్తుతం తెలుగులో ఆమెకి ఒక్క సినిమా కూడా లేదు. మలయాళంలో ఓ సినిమా, తమిళంలో ఒకటి చేస్తూ బిజీగా ఉంది.