టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించి తన అందం, అభినయంతో అభిమానులను సంపాదించుకుంది నటి నిత్యామీనన్. వ్యక్తిగతంగా ఆమెకి ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. అందుకే 'వన్ నెస్ యూనివర్సిటీ' అనే ఆధ్యాత్మిక సంస్థతో నిత్యకు గాఢమైన అనుబంధం ఉంది.

ప్రపంచ మానవులంతా ఒక్కటే అని బోధించే 'వన్ నెస్ యూనివర్సిటీ' సమావేశాలు, కార్యక్రమాలకు అప్పుడప్పుడు నిత్య హాజరవుతుంటుంది. అలా అక్కడ ఆమె కొందరు విదేశీయులతో పరిచయం ఏర్పడింది. ఆ బంధంతోనే ఓ విదేశీయుడిని కౌగిలించుకొని ఫోటో తీసుకుంది. ఆ ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఫ్రెండ్స్, లవ్, హ్యాపీనెస్ క్యాప్షన్ ఇచ్చింది. ఆమె ఇలాంటి ఫోటో షేర్ చేయడంతో నిత్య అభిమానుల్లో చర్చలు మొదలయ్యాయి. ఆ వ్యక్తి ఎవరని..? ఆరా తీయడం మొదలుపెట్టారు. దీంతో నిత్య స్వయంగా క్లారిటీ ఇచ్చింది. అతడి పేరు ఓలివర్.. నా లిటిల్ బ్రదర్ అంటూ క్లారిటీ ఇచ్చేసింది.

ఓలివర్ హాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. అతడి వయసు 18కి మించి ఉండవు. కానీ ఆమె అభిమానుల్లో కలకలం రేగడంతో తన లిటిల్  బ్రదర్ అంటూ స్పష్టం చేసింది.