యువ హీరో నితిన్ దూకుడు ప్రస్తుతం మామూలుగా లేదు. ఏకంగా నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ నితిన్ చేతిలో ఉన్నాయి. వీటిలో కొన్నింటికి అధికారిక ప్రకటన వస్తే మరికొన్ని చిత్రం ప్రారంభమైపోయాయి. నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్. ఇక విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో కూడా నితిన్ ఓ చిత్రాన్ని ప్రారంభించాడు. 

ఈ చిత్రంలో యూట్యూబ్ సెన్సేషన్ ప్రియా ప్రకాష్ వారియర్, స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మరో కీలక పాత్రకు ఆస్కారం ఉందట. ఈ పాత్రకు పేరున్న హీరోయిన్ అయితే బావుంటుందని దర్శకుడు భావిస్తున్నాడు. ఒకప్పుడు తెలుగు యువతని ఒక ఊపు ఊపిన ఇలియానాని చంద్రశేఖర్ యేలేటి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 

నితిన్, ఇలియానా కలసి పదేళ్ల క్రితం రెచ్చిపో చిత్రంలో నటించారు. ప్రజెంట్ ఇలియానా క్రేజ్ మొత్తం మారిపోయింది. అటు బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా ఆమెకు అవకాశాలు కరువయ్యాయి. ఇలాంటి తరుణంలో ఇలియానా, నితిన్ కలసి నటించనుండడం నిజాంగా షాకింగే. 

ఈ రెండు చిత్రాల తర్వాత తొలిప్రేమ ఫేమ్ వెంకీ అట్లూరితో 'రంగ్ దే' చిత్రంలో, కృష్ణ చైతన్య దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నాడు.