విజయాల సంగతేమోగానీ నితిన్ వరుస చిత్రాలతో జోరుమీదున్నాడు. నితిన్ నటిస్తున్న తాజా చిత్రం భీష్మ. ఈ చిత్రంలో నితిన్ సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక నటిస్తోంది. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. 

ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. డిసెంబర్ లో రిలీజ్ చేయాలనేది ప్లాన్. ఈ చిత్ర షూటింగ్ లో మరో హీరోయిన్ జాయిన్ అయినట్లు తెలుస్తోంది. రెండవ హీరోయిన్ కు కూడా ఆస్కారం ఉండడంతో హాట్ బ్యూటీ హెబ్బా పటేల్ ని ఎంపిక చేసుకున్నారు. 

ఈ చిత్రంలో హెబ్బా పటేల్ పాత్ర నిడివి తక్కువగానే ఉంటుందట. కానీ చాలా కీలకమైన పాత్ర కావడంతో హెబ్బా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం హెబ్బా బరువు తగ్గి నాజూగ్గా మారినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. 

భీష్మ తర్వాత నితిన్ చంద్రశేఖర్ యేలేటి చిత్రంలో నటించాల్సి ఉంది. ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్ ఓ హీరోయిన్. రకుల్ ప్రీత్ సింగ్ మరో హీరోయిన్ గా నటిస్తోంది. కుర్ర హీరోయిన్లతో నితిన్ బాగానే జత కడుతున్నాడు.