యంగ్ హీరో నితిన్ కు శుక్రవారం రోజు చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం హైదరాబాద్ మొత్తం భారీ వర్షం కురుస్తోంది. దీనితో నగరంలోని ప్రధాన రోడ్లని జలమయం కావడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్లమేర ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కొద్ది దూరం ప్రయాణించడానికి కూడా గంటల సమయం పడుతోంది. 

హీరో నితిన్ కూడా కొద్దిసేపటి క్రితం ట్రాఫిక్ లో చిక్కుకుపోయాడు. దీనితో తన కారుని డ్రైవర్ కు అప్పగించి నితిన్ దగ్గర్లోని మెట్రో స్టేషన్ కు వెళ్ళాడు. మైట్రో రైల్ లో ప్రయాణించడం ద్వారా నితిన్ త్వరగా తన గమ్యాన్ని చేరుకున్నాడు. 

మెట్రో స్టేషన్ లో, మెట్రో రైలులో నితిన్ అభిమానులతో తీసుకున్న సెల్ఫీలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నితిన్ ప్రస్తుతం భీష్మ చిత్రంలో నటిస్తున్నాడు. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.