`మహానటి`తో జాతీయ అవార్డు అందుకున్న కీర్తిసురేష్‌ కొన్నిరోజులుగా కనిపించడం లేదట. తప్పిపోయిందని వాపోతున్నారు. నితిన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. కీర్తిసురేష్‌ స్కూల్‌ డ్రెస్‌లో ఉన్న ఫోటోని పంచుకుని మిస్సింగ్‌ అంటూ ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. 

`మహానటి`తో జాతీయ అవార్డు అందుకున్న కీర్తిసురేష్‌ కొన్నిరోజులుగా కనిపించడం లేదట. తప్పిపోయిందని వాపోతున్నారు. నితిన్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. కీర్తిసురేష్‌ స్కూల్‌ డ్రెస్‌లో ఉన్న ఫోటోని పంచుకుని మిస్సింగ్‌ అంటూ ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు. దీంతో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. కీర్తి ఎక్కడికి పోయిందని, ఏమైపోయిందని అభిమానులు, సినీ వర్గాలు ఆందోళన చెందుతున్నారు. దీంతో స్పందించిన హైదరాబాద్‌ పోలీసులు టెన్షన్‌ పడకండి నితిన్‌. మేం చూసుకుంటాం` అని రిప్లై ఇవ్వడం విశేషం. మరి ఇంతకేం జరిగిందంటే.. 

నితిన్‌, కీర్తిసురేష్‌ జంటగా `రంగ్‌దే` చిత్రంలో నటిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ నెల(మార్చి) 26న సినిమా విడుదల కానుంది. యూనిట్‌ సినిమా ప్రమోషన్‌ స్టార్ట్ చేశారు. కానీ ఇందులో కీర్తి కనిపించడం లేదు. నితిన్‌,దర్శకుడు, నిర్మాత ఇతర కాస్టింగ్‌ పాల్గొంటుంది. పైగా రేపు సాయంత్రం హైదరాబాద్‌ ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఉంది. కానీ కీర్తి వస్తుందా? అనేది డౌట్‌గా మారింది. 

Scroll to load tweet…

 దీంతో నితిన్‌ స్పందించారు. ట్విట్టర్‌ ద్వారా `మిస్సింగ్‌ అంటూ సెటైరికల్‌గా కామెంట్‌ పెట్టాడు. `మిస్సింగ్‌, కనబడుటలేదు. డియర్‌ అను, నువ్వు ఎక్కడున్నా `రంగ్‌దే` ప్రోమోషన్స్ లో జాయిన్‌ అవ్వాలని మా కోరిక. ఇట్లూ నీ అర్జున్‌` అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కీర్తి పాస్‌పోర్ట్ సైడ్‌ ఫోటోని పంచుకున్నాడు. దీనికి హైదరాబాద్‌ సిటీ పోలీసులు ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. `బాధ పడకండి నితిన్‌. మేం చూసుకుంటాం` అని సరదాగా కామెంట్‌ పెట్టారు. ఈ ఫన్నీ ట్వీట్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై అభిమానులు మీమ్స్ చేస్తూ హంగామా చేస్తున్నారు. ఇక శుక్రవారం విడుదల చేసిన `రంగ్‌దే` చిత్రట్రైలర్‌ మూడు మిలియన్స్ కి పైగా వ్యూస్‌తో దూసుకుపోతుంది.

Scroll to load tweet…