బాలీవుడ్ లో ఇటీవల అందాధున్ సినిమా రెండు విభాగాల్లో నేషనల్  అవార్డ్స్ అందుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్ లో మంచి మంచి లాభాలను అందించిన ఆ కథ ఇప్పుడు సౌత్ స్టార్స్ ని కూడా ఆకర్షిస్తోంది. ముందుగానే టాలీవుడ్ నుంచి నితిన్ సినిమా రీమేక్ రైట్స్ ను కొనుక్కున్నట్లు సమాచారం. 

అయితే ఇప్పుడు ఆ సినిమాకు దర్శకుడు ఎవరన్నది టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ముందుగా  హరీష్ శంకర్ అయితే బెటర్ అని నితిన్ డిసైడ్ అయినట్లు సమాచారం. అదే విధంగా సుధీర్ వర్మ పేరు కూడా లిస్ట్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా సుధీర్ రణరంగం సినిమాతో డిజాస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. 

ఇక ఫైనల్ గా ఈ ఇద్దరిలో ఎవరినో ఒకరిని నితిన్ డైరెక్టర్ గా ఫైనల్ చేసి రీమేక్ పనులను మొదలుపెట్టాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం హరీష్ శంకర్ వాల్మీకి రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తమిళ్ మూవీ జిగర్తాండకు రీమేక్ గా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఒకవేళ వాల్మీకితో హిట్ అందుకుంటే నితిన్ హరీష్ కి అవకాశం ఇస్తాడేమో చూడాలి.