Asianet News TeluguAsianet News Telugu

మరోసారి 'అ..ఆ..' అంటున్న నితిన్!

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం బీష్మ చిత్రంలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర సెట్స్ లో నితిన్ ఏడుస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Nithin once again enter into A Aa movie sets
Author
Hyderabad, First Published Aug 27, 2019, 9:32 PM IST

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం బీష్మ చిత్రంలో నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్ర సెట్స్ లో నితిన్ ఏడుస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నితిన్ నిజంగా ఏడవలేదు. మూడేళ్ళ క్రితం రిలీజైన అ..ఆ చిత్రాన్ని గుర్తుచేసుకుంటూ నితిన్ సరదాగా ఓ పోస్ట్ పెట్టాడు. 

త్రివిక్రమ్ శ్రీనివాస్, నితిన్ కాంబినేషన్ లో వచ్చిన అ.. ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో నితిన్ సరసన సమంత, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 

ఈ చిత్రం కోసం అప్పట్లో ఓ ఇంటి సెట్ వేశారు. ఆ సెట్ ఇప్పటికి అలాగే ఉంది. ఆ సెట్ లోకి నితిన్ మరోమారు ప్రవేశించాడు. భీష్మ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్ని ఈ సెట్ లోనే చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నితిన్ తన ఇంటిని, అ ఆ చిత్ర జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఓ ట్వీట్ చేశాడు. ఏడుస్తునట్లు సరదా వీడియో కూడా పోస్ట్ చేశాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios