యువ హీరో నితిన్ చాలా కాలం తరువాత కెమెరా ముందుకు వచ్చాడు. దాదాపు 10 నెలల గ్యాప్ తరువాత మరో సినిమాతో బిజీ అయ్యాడు. ఛలో దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించనున్న భీష్మా సినిమా నేడు లాంచ్ అయ్యింది. చిత్ర యూనిట్ పూజా కార్యక్రమాలతో సినిమా పనులను స్టార్ట్ చేసింది. 

ఫుల్ ఎంటర్టైనర్ గా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుందని కథానాయకుడు నితిన్ చెబుతున్నాడు. మహాభారతంలో భీష్ముడు సింగిల్ గా ఎలా ఉన్నడో.. ఇప్పటి జనరేషన్ భీష్ముడి అవతారంలో నితిన్ కూడా అలా కనిపించనున్నాడు. ఇక సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటించనుంది. జూన్ 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. 

ఇక ఈ సినిమాపై నితిన్ భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఎందుకంటే అఆ సినిమా అనంతరం నితిన్ మరో హిట్ చూడలేదు. లై - ఛల్ మోహన్ రంగ - శ్రీనివాస కళ్యాణం సినిమాలు దారుణంగా దెబ్బ కొట్టాయి. దీంతో ఈ సినిమా ద్వారా మంచి హిట్ అందుకోవాలని నితిన్ కష్టపడుతున్నాడు. ఈ ఏడాది ఎండింగ్ లో భీష్మా సినిమాను విడుదల చేసేలా చిత్ర యూనిట్ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంది.