ఒక హీరోతో అనుకున్న కథలు కొంతదూరం వెళ్లాక రకరకాల కారణాలతో వేరే హీరోలు చేయటం పరిపాటే.  క్రియేటివ్ డిఫరెన్స్ లు, డేట్స్ ఎడ్జెస్ట్ కాకపోవటం అనే కారణాలతో ఈ ప్రాజెక్టులు ఇలా చేతులు మారుతూంటాయి. రీసెంట్ గా నానితో ముందుకు వెళ్తుంది అనుకున్న సినిమా నితిన్ తో ఫైనల్ అయ్యింది.

తెలుగులో స్క్రీన్ ప్లే మెజీషియన్ గా పేరున్న దర్శకుడు చంద్రశేఖర్ ఓలేటితో హీరో నాని  ఓ సినిమా చేయబోతున్నట్టు గతంలో వార్త వచ్చింది. ఇందులో నాని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు చెప్పారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నితిన్ తో ముందుకు వెళ్ళింది. కారణం ఏమిటనేది తెలియదు కానీ రీసెంట్ గా యేలేటి ..నితిన్ కు కథ చెప్పి ఓకే చేయించుకున్నారు. ఈ మేరకు అఫీషియల్ గా ప్రకటన సైతం వచ్చింది. 

ముందుగా చెప్పినట్లుగానే నా కొత్త సినిమాలకు సంబంధించిన మొదటి ప్రకటన. అద్భుతమైన టాలెంట్‌ ఉన్న చంద్రశేఖర్‌ యేలేటితో త్వరలో ఓ సినిమా చేయబోతున్నాను. భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌ పై ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాత.  కీరవాణి మ్యూజిక్. చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఏప్రిల్‌ నుంచి షూటింగ్ మొదలవుతుంది. మరిన్ని వివరాలు త్వరలో తెలుపుతాను.’ అని ట్వీట్ చేశాడు నితిన్‌.