యంగ్ హీరో నితిన్, క్రేజీ హీరోయిన్ రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం భీష్మ. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ఈ  చిత్రానికి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై నితిన్ భారీగానే ఆశలు పెట్టుకుని ఉన్నాడు. నితిన్ నటించిన గత చిత్రాలు లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం వరుసగా నిరాశపరిచాయి. 

భీష్మ చిత్రంలో ఎలాగైనా విజయాన్ని అందుకోవాలని నితిన్ భావిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్ర సెట్స్ లో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. దర్శకుడు వెంకీ కుడుముల, నితిన్ తో సీరియస్ గా చర్చిస్తున్న ఫోటోని షేర్ చేశాడు. ఈ ఫొటోలో వీరిద్దరికి దూరంగా రష్మిక ఫోన్ చూసుకుంటూ కనిపిస్తోంది. 

మేమిద్దరం సీరియస్ డిస్కషన్ లో ఉంటే రష్మిక ఏం చేస్తోందో చూడండి అని వెంకీ కామెంట్ పెట్టాడు. దీనికి రష్మిక సరదగా రిప్లై ఇచ్చింది. 'ఏయ్.. తెరవెనుక మీరిద్దరూ ఏం చేస్తున్నారో ఆ ఫోటోలు నన్ను కూడా లీక్ చేయమంటారా ? అని సరదాగా కామెంట్ చేసింది. దీనికి నితిన్ రిప్లై ఇచ్చాడు. 'తెర వెనుక అయినా, ముందైనా మేం పని గురించి మాత్రమే ఆలోచిస్తాం అని నితిన్ బదులిచ్చాడు. 

నితిన్ కు బదులిస్తూ రష్మిక మరోమారు ఫన్నీ కామెంట్స్ చేసింది. 'ఏయ్ ఏయ్ ఏయ్ నితిన్ నువ్వు కొంచెం ఆగురే.. తెరవెనుక మీరు చేసే పనులు అందరికి చూపిస్తా.. భీష్మ సింగిల్ ఫర్ ఎవర్ అంట.. ఆ టైటిల్ నాకు మాత్రమే సూట్ అవుతుంది.. మీ ఇద్దరికీ కాదు అని రష్మిక సరదాగా నితిన్, వెంకీలని బెదిరించింది.