VN2 : ‘గణతంత్ర దినోత్సవం రోజునే నితిన్ దోపిడీ’.. దిమ్మతిరిగేలా కొత్త సినిమా గ్లింప్స్, టైటిల్, ఫస్ట్ లుక్!

నితిన్ - వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న రెండో చిత్రం నుంచి సాలిడ్ అప్డేట్ అందింది. తాజాగా టైటిల్ రిలీజ్ గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేశారు. నితిన్ దోపిడీలు చేస్తూ కనిపించడం సినిమాపై ఆసక్తిని పెంచేసింది. 

Nithiin Venky Kudumula Film title Glimpse Revealed NSK

టాలీవుడ్ హీరో నితిన్ Nithiin ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. చివరిగా ‘ఎక్ట్ర్సా ఆర్డినరీ మ్యాన్’ చిత్రంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. దీంతో తదుపరి ప్రాజెక్ట్స్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుములతో కలిసి పని చేస్తున్న విషయం తెలిసిందే. వీరి కాంబోలో ఇప్పటికే ‘భీష్మ’ చిత్రం వచ్చి మంచి సక్సెస్ ను సాధించింది. మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

గతంలో ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. ఇక ఈరోజు గణతంత్ర దినోత్సవం Republic Day 2024 సందర్భంగా VN2 నుంచి సాలిడ్ అప్డేట్ అందించారు. వెంకీ కుడుముల - నితిన్ కాంబోలో రెండో వస్తున్న చిత్ర టైటిల్ ను రిలీజ్ చేస్తూ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ను విడుదల చేశారు. నితిన్ గెటప్, డైలాగ్ డెలివరీ, గ్లింప్స్ లోని చెప్పిన అంశాలు ఆసక్తికరంగా మారాయి. రిపబ్లిక్ డే రోజునే నితిన్ దోపీడీ చేసే టీజర్ రిలీజ్ చేయడం సినిమాపై మరింత బజ్ ను క్రియేట్ చేసింది. 

ఇక ఈ చిత్రానికి ‘రాబిన్ హుడ్’ Robinhood అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. నితిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఎత్తైన టవర్ ను ల్యాడర్ సాయంతో ఎక్కుతున్న స్టిల్ లో దర్శనమిచ్చాడు. ఇక టైటిల్ టీజర్ మరింత ఆసక్తికరంగా మారింది. గ్లింప్స్ లో నితిన్ పలు రకాల గెటప్స్ లో కనిపిస్తుంటాడు. తన ఎంట్రీతో పాటు తన వృత్తిని పరిచయం చేసేలా డబ్బుపై కొన్ని ఆలోచనాత్మకమైన పరిచయ వ్యాఖ్యలను వినిపించారు. 

‘డబ్బు చాలా చెడ్డది... రూపాయి రూపాయి నువ్ ఏం చేస్తావ్ అంటే? అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య చిచ్చు పెడతాను అంటాది. అన్నట్టే చేసింది. దేశం అంత కుటుంబం నాది… ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ములు, ఆభరణాలు వేసుకున్నోళ్లంతా నా అక్క చెల్లెళ్ళు. అవసరం కొద్దీ వాళ్ళ జేబుల్లో చేతులు పెడితే? ఫామిలీ మెంబెర్ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు. అయినా నేను హర్ట్ అవ్వలేదు. ఎందుకంటే... వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం నా హక్కు! మై బేసిక్ రైట్! బికాజ్... ఇండియా ఈజ్ మై కంట్రీ! ఆల్ ఇండియన్స్ అర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ అంటూ చెప్పిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 

Nithiin Venky Kudumula Film title Glimpse Revealed NSK

మొత్తానికి గణతంత్ర దినోత్సవం రోజునే నితిన్ దోపీడీ చేస్తూ అందరి చూపును తన సినిమాపై మళ్లించారు. ఇంతకీ నితిన్ దోచుకోవడమే వృత్తిగా ఎందుకు పెట్టుకున్నారు? అసలు కథ ఏంటీ? ఆ డబ్బునంతా ఏం చేస్తారు? అనే విషయాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. రాబోయే అప్డేట్స్ తో ఈ విషయాలపై ఇంకాస్తా క్లారిటీ రానుంది. ఇక ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు రూపొందిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios