ప్రస్తుతం టాలీవుడ్‌లో పెళ్లిల సీజన్‌ నడుస్తోంది. ఇటీవల యంగ్ హీరో నిఖిల్ లాక్‌ డౌన్‌ను సైతం లెక్క చేయకుండా ఓ ఇంటివాడు కాగా.. మ్యాన్లీ హంక్‌ రానా అదే సమయంలో తాను త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్టుగా ప్రకటించాడు. వెంటనే పెళ్లి పనులు కూడా ప్రారంభించేశాడు. ఇప్పటికే పెళ్లి పనులు ప్రారంభించేసిన మూడు ముళ్లు వేసేందుకు ఎదురుచూస్తున్నాడు మరో యంగ్ హీరో నితిన్‌. దీంతో మిగిలిన యంగ్ హీరోల పెళ్లిలపై పంచ్‌లు పెలుతున్నాయి. ఇప్పటికు వరుణ్ తేజ్‌ పెళ్లి వార్త మీడియాలో హైలెట్‌ కాగా తాజాగా మరో ఇంట్రస్టింగ్ డిస్కషన్‌ జరిగింది.

తాజాగా నితిన్ , సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతున్న సోలో బ్రతుకే సోబెటరూ సినిమాలోని పాటను రిలీజ్ చేశాడు. ప్రజెంట్ సిచ్యువేషన్‌ కు పర్ఫెక్ట్‌గా సూట్‌ అయ్యేలా నో పెళ్లి అంటూ సాగే ఈ పాటను తన సోషల్‌ మీడియా పేజ్‌లో రిలీజ్ చేశాడు నితిన్‌. పాటతో పాటు చూస్తా ఎన్ని రోజులు ఇలా సింగిల్‌గా ఉంటావో అంటూ కామెంట్ చేశాడు. సినిమాలో వెన్నెల కిశోర్‌ పెళ్లి సందర్భంగా వచ్చే ఈ పాటను ప్రమోషన్‌ కోసం ప్రత్యేకంగా చిత్రీకరించారు. అందులో భాగంగా మరో మెగా హీరో వరుణ్ తేజ్‌, పెళ్లికి రెడీ అవుతున్న రానా కూడా ఈ పాటలో దర్శనమిచ్చారు.

తమన్ సంగీతమందించిన ఈ పాటకు రఘరామ్ సాహిత్మమదించగా బుట్టబొమ్మతో సెన్సేషన్‌ సృష్టించిన అర్మాన్‌ మాలిక్‌ అద్భుతంగా ఆలపించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాతో కొత్త దర్శకుడు సుబ్బు టాలీవుడ్‌ కు పరిచయం అవుతున్నాడు.