యంగ్ హీరో నితిన్ కి గత ఏడాది పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మాస్ చిత్రంతో హిట్ కొట్టాలన్న కసితో నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే చిత్రంలో నటించాడు. డెబ్యూ డైరెక్టర్ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది.

యంగ్ హీరో నితిన్ కి గత ఏడాది పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మాస్ చిత్రంతో హిట్ కొట్టాలన్న కసితో నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే చిత్రంలో నటించాడు. డెబ్యూ డైరెక్టర్ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో నితిన్ తన తదుపరి చిత్రాలతో ఫ్యాన్స్ ని డిజప్పాయింట్ చేయకూడదని డిసైడ్ అయ్యాడు. 

నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే మరోసారి భీష్మ డైరెక్టర్ వెంకీ కుడుములు, రష్మిక మందన కాంబినేషన్ లో చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై ఆల్రెడీ అంచనాలు మొదలయ్యాయి. అయితే నితిన్ గురువారం రోజు తన 40వ జన్మదిన వేడుక జరుపుకున్నాడు. 

నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రాల నుంచి ఎలాంటి ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్ కాలేదు. వెంకీ కుడుములు చిత్రం నుంచి మాత్రం షాడోలో ఉన్న ఒక పోస్టర్ రిలీజ్ చేసారు అంతే. దీనితో నితిన్ అభిమానులు బాగా నిరాశకి గురయ్యారు. 

Scroll to load tweet…

దర్శకుడు వక్కంతం వంశీ.. నితిన్ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. కొన్ని బంధాలు మాటలకి అందనివి. అలాంటి బంధమే మాది. హ్యాపీ బర్త్ డే నితిన్. మనం ఎలాంటి చిత్రం చేస్తున్నామో ఆడియన్స్ కి చూపించేందుకు ఎదురుచూడలేకున్నాను అంటూ వక్కంతం వంశీ ట్వీట్ చేసారు. నితిన్ నీతో కలసి ఉన్న పిక్ షేర్ చేశారు. 

ఈ ట్వీట్ పై నితిన్ స్పందిస్తూ.. థ్యాంక్యూ సోమచ్ డార్లింగ్. మన కంటెండ్ డిలే ఉన్నప్పటికీ ఇంపాక్ట్ డబుల్ ఉంటుంది. సారీ గాయ్స్ కాస్త ఓపిక పట్టండి. ఈసారి డిజప్పాయింట్ చేయను అంటూ ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…

బర్త్ డే కి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఓ అభిమాని.. మేము ఆల్రెడీ డిజప్పాయింట్ అయ్యాము లే అన్నా. బర్త్ డే బాగా గుర్తుండేలా చేశావ్ అంటూ నిరాశ వ్యక్తం చేశారు. ఆ అభిమానికి నితిన్ రిప్లై ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేశాడు. సినిమా మీ అందరికి బాగా గుర్తుండిపోయేలా.. తెగ నచ్చేలా చేస్తా తమ్ముడు అంటూ నితిన్ స్పందించాడు. వక్కంతం వంశీ రచయితగా తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకున్నారు. కానీ ఆయన దర్శకుడిగా తెరకెక్కించిన చిత్రం నా పేరు సూర్య డిజాస్టర్ గా నిలిచింది.