అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప . ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా రంపచోడవరం అడవుల్లో మొదలైన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ ఓ యాక్షన్ సీక్వెన్స్ ను పూర్చి చేసుకుని హైదరాబాద్ వచ్చేసారు. సెకండ్ షెడ్యూల్ అతి త్వరలో మొదలు కానుంది. షూటింగ్ మొదలై ఇన్ని రోజులైనా  పుష్ప సినిమాకి ఇంకా సుకుమార్ విలన్ ని ఫైనల్ చెయ్యలేసి అఫీషియల్ గా ప్రకటించలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో తొమ్మిది మంది విలన్స్ ఉన్నారని తెలుస్తోంది.  తెలుగుతో పాటు దక్షిణాది భాషలకు చెందిన పలువురిని ఇందులో భాగం చేయాలనుకుంటున్నారు సుకుమార్. అందులో సునీల్ ఒకరట. అయితే మెయిన్ విలన్ ఎవరినీ ఇంకా నిర్మాతలు లాక్ చేయలేదు. 

అల్లు అర్జున్ తో తలపడబోయే మెయిన్ విలన్  మంచి ఫాలోయింగ్ ఉన్నవాడు  అయ్యుండాలి.. ఆ నటుడికి పాన్ ఇండియాలో క్రేజ్ రావాలనే యోచనలో సుకుమార్ ఇంతవరకు పుష్ప విలన్ వేటలోనే ఉండిపోయాడు. విజయ్ సేతుపతి అయితే పాన్ ఇండియాకి సరిపోయే విలన్ పాత్ర పడుతుంది అనుకున్నారు.  విజయ్ సేతుపతిని ఖరారు చేసుకున్నారు. కానీ డేట్లు క్లాష్‌ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి విజయ్ తప్పుకోగా.. ఆ స్థానంలో మాధవన్‌ని తీసుకున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక వాటిపై  స్పందించారు మాధవన్‌. ఇది నిజం కాదంటూ  ట్వీట్ చేశారు.సుకుమార్ కి పుష్ప విలన్ కష్టాలు కంటిన్యూ అవుతున్నట్లు చెప్తున్నారు. 

మరో ప్రక్క కొంతకాలంగా ప్లాప్ సినిమాలు చేస్తున్న ప్రయోగాల హీరో విక్రమ్.. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తో తలపడబోయే విలన్ అంటూ ప్రచారం మొదలయ్యింది. సుక్కు అండ్ అల్లు అర్జున్ లు విక్రమ్ తో సంప్రదింపులు జరుపుతున్నారని అంటున్నారు. అయితే పుష్ప విలన్ పాత్ర నటనకు ప్రాధాన్యమున్న పాత్ర కావడంతో విక్రమ్ కూడా సుక్కు ఆఫర్ ని కాదనలేకపోయాయాడని  ప్రచారం చేస్తున్నారు.

పుష్పలో బన్నీ పాత్రపై పలు రకాల వార్తలు వస్తున్నాయి. కూలీ నుంచి ఎర్ర చందనం స్మగ్లర్‌గా బన్నీ మారనున్నాడని, ఈ పాత్ర కోసం బన్నీ కూడా రీసెర్చ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో బన్నీ సరసన రష్మిక మొదటిసారి జత కట్టబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రాబోతున్న ఈ మూవీపై అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి.