Asianet News TeluguAsianet News Telugu

కొనసాగుతున్న కార్తికేయ 2 సంచలనాలు... అక్కడ కూడా ప్రభంజనమే!

నిఖిల్ లైఫ్ టైం గుర్తుపెట్టుకోవాల్సిన చిత్రం కార్తికేయ 2. ఈ మూవీతో ఆయన స్టార్ హీరో రేంజ్ వసూళ్లు అందుకున్నారు. ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు.

nikhil starer karthikeya 2 creates records in ott too
Author
First Published Oct 8, 2022, 4:56 PM IST

ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ నమోదు చేసిన చిత్రాల్లో   ‘కార్తికేయ 2’ కూడా ఒకటి. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించాడు. నిఖిల్ సినీ కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా. వరల్డ్ వైడ్ కార్తికేయ 2 దాదాపు రూ. 60 కోట్ల షేర్ సాధించింది. ఇక గ్రాస్ వంద కోట్లకు పైగా వసూలు చేసింది. హిందీలో కార్తికేయ 2 రూ. 30.5 కోట్ల నెట్ కలెక్టన్స్ సాధించడం మరొక సంచలనం.   

ఆగష్టు 13న థియేటర్లలో తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషల్లో విడుదలైన కార్తికేయ 2.బాక్సాఫీస్ వద్ద భీభత్సమైన ప్రాఫిట్స్ రాబట్టడం విశేషం. కృష్ణతత్వం, దాని చుట్టూ అల్లుకున్న మిస్టరీల నేపథ్యంలో రూపొందిన కార్తికేయ 2 సినిమాకు తెలుగుతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 

ఇక కార్తికేయ డిజిటల్ రైట్స్ జీ 5 సొంతం చేసుకుంది. అక్టోబర్ 5న దసరా కానుకగా జీ 5  ఓటిటి లో రిలీజైన కార్తికేయ-2 చిత్రం కేవలం 48 గంటల్లో 100 కోట్లు పైగా నిమిషాల స్ట్రీమింగ్ అయి సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని జీ5 సంస్థ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. మాములుగా థియేటర్స్ లోనే ప్రభంజనం చూపించడం కాకుండా ఓటిటి లో అదే స్థాయిలో ఆదరణ పొందడం విశేషం. ఇక దర్శకుడు చందూ మొండేటి పార్ట్ 3 కూడా ఉందని ప్రకటించడం విశేషం. హీరో నిఖిల్ తోనే ఆ చిత్రం కూడా చేయనున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios