షూట్ పూర్తవకుండానే రిలీజ్ చేసేశారు, నిఖిల్ షాకింగ్ కామెంట్స్
మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ ఫెయిల్యూర్ పై నిఖిల్ మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశాడు. రిలీజై ఇన్నాళ్లైనా ఆయనలో ఆ వేదన పోలేదు అని అర్దమైంది.

నిఖిల్ చేసిన 'కార్తికేయ2' పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను మెప్పించిక ఆయన మార్కెట్ ఒక్కసారిగా రెట్టింపు అయ్యింది. ఆ ఇమేజ్‌కి తగ్గట్టుగానే 'స్పై' సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు . ప్యాన్ ఇండియాకు తగ్గట్టుగా కథని ఎంచుకుని 'స్పై' ని చేసారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం వెనుక రహస్యాన్ని పాయింట్‌గా చూపిస్తూ .. ఓ గూఢచారి కథతో రూపొందిన చిత్రమిది. సినిమాకు రిలీజ్ రోజు డివైడ్ టాక్ వచ్చినా స్పై ప్రపంచవ్యాప్తంగా ఫరవాలేదనిపించే వసూళ్లు చేసింది.
అయితే సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న సీక్రెట్స్ గురించి చెబుతాను అంటూ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చిన ఈ సినిమాలో.. అసలు ఆ పాయింటే లేకపోవడంతో ప్రేక్షకులకు రిజెస్ట్ చేసారు. దీంతో మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఇక ఈ ఫెయిల్యూర్ పై నిఖిల్ మాట్లాడుతూ అసహనం వ్యక్తం చేశాడు. రిలీజై ఇన్నాళ్లైనా ఆయనలో ఆ వేదన పోలేదు అని అర్దమైంది.
నిఖిల్ మాట్లాడుతూ.. “స్పై మూవీ విషయంలో చాలా తప్పులు జరిగాయి. షూటింగ్ కూడా మొత్తం పూర్తి అవ్వలేదు. ఇంకా పది రోజులు షూటింగ్ చేయాల్సి ఉంది. కానీ అది చేయకుండానే సినిమాని రిలీజ్ చేశారు. ఈ విషయం నాకు కోపం తెప్పించింది. నా ఫ్యూచర్ సినిమాల్లో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటాను” అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. రిలీజ్ కు ముందు ఈ మూవీ ప్రమోషన్స్ సమయంలో కూడా నిఖిల్ కి సమాచారం ఇవ్వకుండానే సాంగ్ ని నిర్మాతలు రిలీజ్ చేసేశారు. వివాదం అయ్యింది.
అప్పట్లో వదిలిన ప్రెస్ నోట్ లో...హిందీ, కన్నడ, తమిళం, మలయాళ ప్రేక్షకులందరికీ నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కార్తికేయ-2తో మీకు దగ్గరయ్యాను కానీ స్పై సినిమాను అందించలేకపోయాను. తర్వాత నా నుంచి రాబోయే 3 సినిమాలను అన్ని భాషల్లోని థియేటర్‌లలో ఖచ్చితంగా అనుకున్న సమయానికే రిలీజ్ అవుతాయని మాట ఇస్తున్నాను. నాపై నమ్మకం ఉంచిన తెలుగు సినిమా అభిమానులకు కూడా మాట ఇస్తున్నాను. ఇక నుంచి సినిమా క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీపడను. నాపై ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా కూడా మీకు మాత్రం మంచి కంటెంట్ ఉన్న సినిమాను అందిస్తాను' అని నిఖిల్ తెలిపాడు.
జై అనే గూఢచారిగా ఇంటెన్స్ యాక్షన్ రోల్‌కు న్యాయం చేసేందుకు నిఖిల్ చాలా కష్టపడ్డాడు. కానీ అర్థపర్థం లేని కథ, కథనాల కారణంగా అతడి శ్రమ మొత్తం వృథాగా మారిపోయింది. ఆర్యన్ రాజేష్ మూడు సీన్స్, రానా ఒక్క సీన్‌కు పరిమితమయ్యారు.