రీసెంట్ గా  చందూ మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ 2' సినిమాను మొదలెట్టి శరవేగంగా షూటింగ్ లో పాల్గొంటున్న నిఖిల్ మరో సినిమాని పట్టాలు ఎక్కించారు. సూర్య ప్రతాప్ దర్శకత్వంలో కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమా త్వరలో మొదలుకానుంది. ఈ సినిమాకి కథ - స్క్రీన్ ప్లేను సుకుమార్ అందించడం విశేషం.ఈ సినిమాకి '18 పేజెస్' అనే టైటిల్ ను ఖరారు చేసి ఫస్ట్ లుక్ వదిలారు.

 ఇంతకుముందు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన 'కుమారి 21F' విజయవంతం కావడంతో, అదే సెంటిమెంట్ తో ఈ సినిమాలో టైటిల్ లోను నెంబర్ ఉండేలా సూర్యప్రతాప్ చూసుకున్నాడని చెప్పుకుంటున్నారు. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతున్న ఈ సినిమా కు సుకుమార్ కథ,మాటలు అందిస్తూండటంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడుతున్నాయి. 

వెరైటీ టైటిల్ తో వస్తున్న ఈ మూవీకి సుకుమార్ మార్క్ కచ్చితంగా ఉంటుందని అంటున్నారు. హ్యాపీ డేస్ సినిమాతో  అడుగుపెట్టి తనదైన నటన తో వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు నిఖిల్ . హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలతో దూసుకెళ్తున్నారు ఈ యాంగ్ హీరోకు ఈ మధ్యన అర్జున్ సురవరంతో మరోసారి బ్రేక్ వచ్చింది .

 ఇన్నాళ్లూ  చిన్న దర్శకులు చిన్న బ్యానర్ లతో సినిమాలు చేసిన నిఖిల్. ఇప్పుడు  గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బ్యానర్ , సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ తో పని చేసే ఛాన్స్ రావడం నిజంగా లక్ అనే చెప్పాలి.  నిఖిల్ కి మరో హిట్ ఇవ్వడం ఖాయమనే ఆభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.