RRR ఒక అబద్దం అని, అందులో చూపించినవి అన్నీ అబద్దాలే అని, కనీసం మీ సినిమాలో అయినా నిజం చూపిస్తున్నారా? లేదా ఇది కూడా అబద్ధమేనా? అంటూ నిఖిల్ కు షాకింగ్ ప్రశ్న వేసాడు ఒక రిపోర్టర్. 

ఒక్కోసారి మీడియా మీట్ లో ఊహించని ప్రశ్నలు ఎదుర్కోవాల్సిన పరిస్దితి ఎదురౌతుంది హీరోలకు. ఇంతకు ముందు అంటే హీరో,హీరోయిన్స్ విషయంలో మీడియా వారు చాలా ఉదారంగా ఉండేవారు. వాళ్లను చిన్న మెత్తు ఇబ్బంది పెట్టేవారు కాదు. అందుకు తగ్గట్లుగా పీఆర్వోలు ప్రిపేర్ చేసేవారు. కానీ ఇప్పుడు మన తెలుగు మీడియా కూడా హిందీ మీడియాలాగ మారుతోంది. ఒక్కోసారి వారు అడిగే ప్రశ్నలు, చేసే కామెంట్స్ హీరో,హీరోయిన్స్ ని ఇరుకున పెడుతున్నాయి. ఆచి,తూచి స్పందించాల్సి వస్తోంది. తాజాగా నిఖిల్ అలాంటి ప్రశ్న ఒకటి ఎదుర్కొన్నారు. 

RRR ఒక అబద్దం అని, అందులో చూపించినవి అన్నీ అబద్దాలే అని, కనీసం మీ సినిమాలో అయినా నిజం చూపిస్తున్నారా? లేదా ఇది కూడా అబద్ధమేనా? అంటూ నిఖిల్ కు షాకింగ్ ప్రశ్న వేసాడు ఒక రిపోర్టర్. యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ "స్పై" ప్రమోషన్స్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఈ ఇంటెరెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్న విని అక్కడున్న చాలా మంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. 

RRR మూవీలో ఇద్దరు స్వాతంత్ర సమరయోధుల కథను చెప్తున్నాం అని చెప్పి రాజమౌళి ఒక అబద్దపు కథను తీసాడు. అది ఆస్కార్ విన్ అయుండొచ్చు కానీ అది ఒక అబద్దపు కథ. ఇప్పుడు మీరు కూడా నేతాజీ సుభాష్ చంద్రబోస్ కథతో సినిమా తీస్తున్నారు. కనీసం ఈ సినిమాలో అయినా నిజం చెప్తున్నారా లేక ఈ సినిమా కూడా అబద్ధమేనా? అని అడిగాడు.

ఈ ప్రశ్నకు మొదట ఖంగుతున్న నిఖిల్.. RRR సినిమా తెలుగువాళ్లను గర్వ పడేలా చేసింది. ఆస్కార్ తెచ్చింది. నేను చాలా హ్యాపిగా ఉన్నాను. అబద్దపు సినిమా కాదు అది ఒక ఫిక్షనల్ కథ. కానీ మేము స్పై సినిమాలో నిజాలే చెప్పబోతున్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణంలో సమయంలో ఏం జరిగింది. దానిని ఎందుకు ఇన్ని సంవత్సరాల పాటు ఇంకా సీక్రెట్ గానే ఉంచారు అనే చాలా విషయాల్ని ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఖచ్చితంగా స్పై సినిమా అబద్దం సినిమా కాదు అని చెప్పుకొచ్చాడు నిఖిల్. దాంతో నిఖిల్ ఏం చెప్తాడో...అని ఎదురుచూసిన వారికి ఫెరఫెక్ట్ సమాధానం దొరికినట్లైంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక స్పై మూవీ జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహిస్తున్నాడు.