హీరో నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అంతే కాదు పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ని నిలబెట్టుకునేందుకు నిఖిల్ మునుపటి కంటే ఎక్కువగా కష్టపడుతున్నాడు.
హీరో నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అంతే కాదు పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ని నిలబెట్టుకునేందుకు నిఖిల్ మునుపటి కంటే ఎక్కువగా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం నిఖిల్ చేస్తున్నవన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే.
నిఖిల్ ప్రస్తుతం స్వయంభు అనే హై బడ్జెట్ మూవీలో నటిస్తున్నాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరక్కుతోంది. మరోవైపు నిఖిల్ రాంచరణ్ నిర్మాణంలో ఇండియా హౌస్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా నిఖిల్ ఫ్యామిలీలో ఇటీవల సంబరాలు మొదలయ్యాయి. గత నెల ఫిబ్రవరిలో నిఖిల్, పల్లవి దంపతులకు పండంటి మగబిడ్డ జన్మించాడు.
అయితే నేడు తమ ముద్దుల కొడుక్కి బారసాల కార్యక్రమం నిర్వహించారు. తొలిసారి ఊయలలో వేయడం, నామకరణం లాంటి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ ఫోటోలని నిఖిల్ సతీమణి పల్లవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. కానీ కొడుకు ముఖాన్ని మాత్రం రివీల్ చేయలేదు.
నిఖిల్, పల్లవి ఇద్దరూ తమ కొడుకుని ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకుని మురిసిపోతున్నారు. అయితే తమ కొడుక్కి ఏం పేరు పెట్టారు అనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. దీనితో నిఖిల్ కొడుకు పేరు ఏంటా అని అభిమానులు ఆలోచిస్తున్నారు.
