మెగా డాటర్ నిహారిక కొణిదెల నుంచి మరో సినిమా రావడానికి సిద్ధమైంది. సూర్యకాంతం అనే సినిమాతో ఒక డిఫరెంట్ స్టైల్ లో రానున్న ఈ అల్లరిపిల్ల.. టీజర్ తోనే గట్టి సౌండ్ ఇస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మోడ్రన్ సూర్యకాంతంగా ఓ వర్గం ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. 

సీనియర్ నటి సూర్యకాంతం గయ్యాళి పర్ఫామెన్స్ ను యంగ్ మెగా డాటర్ తనదైన శైలిలో చూపిస్తున్నట్లు అర్ధమవుతోంది. టీజర్ లో నాన్ స్టాప్ డైలాగులు షాక్ ఇస్తున్నాయి. 'తినడానికి పునుగులు లేవంట గాని బెగ్గర్ కి బర్గర్ కొనిచ్చాడట నీలాంటోడు' అనే డైలాగ్ రియలిస్టిక్ గా ఉంది. కామెడీ టైమింగ్ ను అమ్మడు బాగానే అలవాటు చేసుకున్నట్లు అనిపిస్తోంది. 

ప్రణీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిర్వాణ ప్రొడక్షన్ లో తెరకెక్కుతోంది. ఇక నిహారిక సరసన రి రాహుల్ నటించిన ఈ సినిమా మార్చ్ 29న విడుదల కానుంది. మరి ఈ సూర్యకాంతం కాన్సప్ట్ తో మెగా డాటర్ ఎంతవరకు హిట్టందుకుంటుందో చూడాలి.