పెళ్లి తరువాత సిల్వర్ స్క్రీన్ కు దూరం అయ్యింది మెగా డాటర్ నిహారిక. గతంలో నటిగా, హోస్ట్ గా.. నిర్మాతగా వ్యావహరించిన ఆమె.. ఆఫ్టర్ లాంగ్ టైమ్.. వెబ్ సిరీస్ తో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతోంది.  

మెగా ఫ్యామిలీలో అంతా హీరోలు బయటకు వస్తుంటే..ఫస్ట్ టైమ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెగా డాటర్ నిహారికా కొనిదెల. ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది. హోస్ట్ గా, నిర్మాతగా, నటిగా తన టాలెంట్ నిరూపించుకుంది స్టార్ బ్యూటీ. ఆతరువా చైతన్యతో పెళ్లి కుదరగానే.. తాను సిల్వర్ స్క్రీన్ వదిలేస్తున్నట్టు చెప్పేసింది. పెళ్ళి తరువాత అసలు ఇటువైపు తొంగి చూడలేదు నిహారిక. మళ్ళీ ఇన్నేళ్లకు రీ ఎంట్రీకి రెడీ అయ్యింది. 

అయితే ఈమధ్య నిహారిక-చైతన్య మధ్య మనస్పర్ధలు వచ్చినట్టు వార్తలు గుప్పుమన్నాయి. వీరిద్దరు డివోర్స్ తీసుకోబోతున్నరన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈక్రమంలో చైతన్య, నిహారిక తమన సోషల్ మీడియా పేజ్ లో ఫోటోలు డిలేట్ చేయడంతో.. ఇక వీరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని ఫిక్స్ అయ్యారు జనాలు. దాంతో నిహారిక మళ్ళీ తన కెరీర్ మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. విడిపోయిన విషయం అఫీషియల్ గా అనౌస్స్ చేయకపోయినా.. అనఫిషియల్ గా హింట్స్ ఇవ్వడంతో.. సోషల్ మీడియాలో ఇది హైలెట్ అయ్యింది.

ఇక మెగా డాటర్ నిహారిక మళ్ళీ తన మూవీ కెరీర్ పై ఫోకస్ చేసింది. గతంలో తన సొంత బ్యానర్లో కొన్ని వెబ్ సిరీస్ లను నిర్మించింది. ఆ వెబ్ సిరీస్ లలో ఆమెనే ప్రధానమైన పాత్రను పోషించింది. ఇక ఇప్పుడు కూడా ఇదే ఫార్ములాతో రీ ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది నిహారికా కొణిదెల. పెళ్లి తరువాత నిహారిక డెడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ ద్వారా రీ ఎంట్రీ ఇస్తోంది. బ్రిటన్ వెబ్ సిరీస్ ఆధారంగా దీనిని రూపొందించారు.

ఆదిత్య మండల దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్, డిస్నీ‌-ప్లస్ హాట్ స్టార్ లో ఈనెల 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ ను నిర్మించడంతో పాటునిహారిక ముఖ్యమైన పాత్రలో కనిపించింది. గాయత్రి పాత్రలో నిహారిక కనిపించగా ఇతర ముఖ్యమైన పాత్రల్లో, అక్షయ్, భావన, వైవా హర్ష కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వదిలిన టీజర్ తో ఈ వెబ్ సిరీస్ పై అంచనాలుపెరిగిపోయాయి. అంతే కాదు ఆడియన్స్ లో ఆసక్తి కూడా పెరిగింది.

వీడియో గేమ్స్ చూపిస్తున్న ప్రభావం నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ నడుస్తుంది. కొంతమంది యువతీ యువకులు వీడియో గేమ్ ఆడుతూ తమ చుట్టూ ఏం జరుగుతుందనేది పట్టించుకోకపోవడం వలన, ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చింది అనేది ఈ వెబ్ సిరీస్ కథ. ఈక్రమంలో ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. 

ఈ నేపథ్యంలో నిహారిక మాట్లాడుతూ.. నాలుగేళ్ల తరువాత మళ్లీ ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను. ఇది నాకు ఎంతో ప్రత్యేకం. నన్ను నేను కూడా గాయత్రి పాత్రలో ఊహించుకోలేను. కానీ మా దర్శకుడు ఆదిత్య నన్ను నమ్మి నాకు ఈ పాత్రను ఇచ్చారు. ఈ పాత్రను చేయగలని నమ్మకం ఇచ్చినందుకు థాంక్స్. అక్షయ్‌కి సినిమాలు అంటే బాగా ఇష్టం. మా ఇద్దరి మధ్యే ఎక్కువ సీన్లు ఉంటాయి. హర్ష నాకు ఎప్పటి నుంచో తెలుసు. రోషణ్ పాత్రే చాలా కష్టమని కథ విన్నప్పుడు మాకు అనిపించింది. ఆ పాత్రను రోనక్ అద్భుతంగా పోషించారు. భావనతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. నన్ను ఇంత అద్భుతంగా చూపించినందుకు ఫహద్ గారికి థాంక్స్ అన్నారు నిహారిక కొణిదెల.