మెగా డాటర్, నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక పెళ్లి పీటలు ఎక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పెళ్లికి సంబంధించిన హింట్స్ ని రెండు రోజులుగా నిహారిక ఇస్తూనే ఉంది.  ముందు కాఫీ కప్ పై త్వరలో పెళ్లి అంటూ చెప్పిన నిహారిక.. గురువారం సాయంత్రం ఏకంగా తనకు కాబోయే వరుడి ఫోటో కూడా పెట్టేసింది. అయితే.. అందులో అతని ముఖం కనపడలేదు. దీంతో ఎవరై ఉంటారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Peek-a-boo

A post shared by Niharika Konidela (@niharikakonidela) on Jun 18, 2020 at 4:47am PDT

కాగా.. తాజాగా అతని ఫోటో ఒకటి బయటకు వచ్చింది. నిహారిక తో అతను కలిసి దిగిన ఫోటో ఇప్పుడు బయటకు వచ్చేసింది. అతని పేరు చైతన్య జొన్నలగడ్డ. చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు కలిసి వెళ్లి ఈ వివాహం పైనలైజ్ చేసారు. 

పెళ్లి కొడుకు ఓ ఎమ్ ఎన్ సి కంపెనీలో ఎగ్జిక్యుటివ్ గా పనిచేస్తున్నారు. ఓ పెద్ద పేరున్న కాలేజీలో మేనేజ్మెంట్ గ్యాడ్యుయేట్ గా చేస్తున్నారు. 

ఇక నీహారిక, చైతన్యల ఎంగేజ్మెంట్ ఆగస్టులో జరగనుంది. వివాహం పిభ్రవరి 2021లో చేస్తారు. డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగే అవకాసం ఉంది. 

గతంలో నాగబాబు తన కూతురి వివాహ విషయాలను ప్రస్తావించారు. 'వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లో నీహారిక పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ప్రస్తుతం తనకో మంచి వరుణ్ని వెతికే పనిలో ఉన్నాం. నీహారిక పెళ్లి తర్వాత వరుణ్‌తేజ్‌ పెళ్లి గురించి ఆలో చిస్తాం. వీరిద్దరి పెళ్లిళ్లు అయిపోతే నా బాధ్యత తీరిపోతుంది' అని నాగబాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.