పవన్-క్రిష్ మూవీపై ఇండియా వైడ్ ట్రెండ్ అవుతున్న క్రేజీ న్యూస్...!
పవన్ 27వ మూవీలో హీరోయిన్ నిధి అగర్వాల్ అంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది. దీనిపై అధికారికమైన ప్రకటన లేకున్నప్పటికీ ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతుంది. మరి నిధి అగర్వాల్ ని పవన్ సరసన నటించాలని ఫ్యాన్స్ ఇష్టపడుతున్నారేమో కానీ ఈ న్యూస్ ని భారీగా ట్రెండ్ చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ మొదటిసారి ఓ పీరియాడిక్ మూవీలో నటిస్తున్నారు. టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుల్లో ఒకరిగా ఉన్న క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ మూవీ చేస్తున్నారు. మొగలుల కాలం నాటి ఈ కథలో పవన్ కళ్యాణ్ ని క్రిష్ ఓ దొంగలా ప్రెజెంట్ చేయనున్నారు. పేదల కోసం రాజుల ఖజానాలు దోచే వీరుడిగా పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు.
పవన్ బర్త్ డే కానుకగా ఈ చిత్ర ప్రీ లుక్ విడుదల చేయగా విశేష ఆదరణ దక్కించుకుంది. లాక్ డౌన్ కి ముందు ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. లాక్ డౌన్ తరువాత మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళలేదు. ఐతే ఈ మూవీలో హీరోయిన్ ఆమెనే అంటూ ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇస్మార్ట్ శంకర్ మూవీతో భారీ హిట్ అందుకున్న నిధి అగర్వాల్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుందట. పవన్ 27వ మూవీలో హీరోయిన్ నిధి అగర్వాల్ అంటూ న్యూస్ ట్రెండ్ అవుతుంది. దీనిపై అధికారికమైన ప్రకటన లేకున్నప్పటికీ ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతుంది. మరి నిధి అగర్వాల్ ని పవన్ సరసన నటించాలని ఫ్యాన్స్ ఇష్టపడుతున్నారేమో కానీ ఈ న్యూస్ ని భారీగా ట్రెండ్ చేస్తున్నారు.
ఏ ఎం రత్నం భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా,భారీ అంచాలనున్నాయి. ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేస్తున్న పవన్ వచ్చే ఏడాది క్రిష్ మూవీ షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నాడు.