సీబీఐ విచారణ తరువాత సుశాంత్ డెత్ కేసులో అనేక కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. తాజాగా సిస్టర్ ప్రియాంకతో సుశాంత్ చేసిన వాట్స్ అప్ చాట్ బయటికి రాగా కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. మొదటి నుండి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తండ్రి కేకే సింగ్ తన కుమారుడికి ఎటువంటి మానసిక రుగ్మత లేదని చెప్పుకుంటూ వస్తున్నారు. సుశాంత్ అసలు మానసిక ఒత్తితో బాధపడుతున్నట్లు ఎప్పుడూ తమకు చెప్పడం కానీ చేయలేదని అన్నారు. 

ఐతే తాజా వాట్స్ అప్ చాట్ ద్వారా ఆయన అబద్దం చెబుతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.సిస్టర్ ప్రియాంక మరియు సుశాంత్ మధ్య జరిగిన వాట్స్ అప్ చాట్ ప్రకారం సుశాంత్ మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని వారికి తెలుసు. అలాగే సుశాంత్ మానసిక వ్యాధికి సంబంధించిన సంభాషణ కూడా వీరి మధ్య జరిగింది. అలాగే సుశాంత్ వాడుతున్న మెడిసిన్ కూడా డాక్టర్ సూచనలు లేకుండా కుటుంబమే మార్గదర్శకం చేసినట్లు తెలుస్తుంది. 

రియా మొదటి నుండి సుశాంత్  మెంటల్ హెల్త్ బాగోలేదని గట్టిగా చెవుతున్న సంగతి తెలిసిందే. సుశాంత్ డ్రగ్స్ తీసుకుంటుంటే వద్దని వారించినట్లు కూడా ఆమె చెప్పడం జరిగింది. తాజా పరిణామాలతో రియాకు ఈ కేసులో కొంచం ఊరట కలిగినట్లు అయ్యింది. ఇక గత మూడు రోజులుగా రియా సీబీఐ ఎదుట విచారణకు హాజరవుతున్నారు.