బుల్లితెర నటి వైశాలి టక్కర్ ఆత్మహత్య చేసుకోవడం చిత్ర పరిశ్రమలో మారింది. 30 ఏళ్ల వైశాలి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
బుల్లితెర నటి వైశాలి టక్కర్ ఆత్మహత్య చేసుకోవడం చిత్ర పరిశ్రమలో మారింది. 30 ఏళ్ల వైశాలి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం రోజు ఈ సంఘటన చోటు చేసుకుంది. నటిగా ఎంతో భవిష్యత్తు ఉన్న వైశాలి ఇలా మధ్యలోనే తన జీవితాన్ని ముగించడంతో ఫ్యామిలీ, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు.
పోలీసులు మీ ఆత్మహాత్యకు కారణాలు అన్వేషిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా వారికి వైశాలి రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. సూసైడ్ నోట్ లో అంశాల ఆధారంగా పోలీసులు కేసుని ఛేదించే పనిలోపడ్డారు. తాజాగా ఈ కేసులో కీలకమైన మలుపు చోటు చేసుకుంది.
వైశాలి మానసిక వేదనకిగురై సూసైడ్ చేసుకోవడానికి కారణం ఆమె పక్కింట్లో ఉంటున్న రాహుల్ అనే వ్యక్తే కారణం అంటున్నారు. ఈమేరకు ఇండోర్ ఏసిపి రెహమాన్ కీలక విషయాలు వెల్లడించారు. రాహుల్.. వైశాలిని వేధించడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం రాహుల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వైశాలి మరో వ్యక్తిని వివాహం చేసుకునేందుకు రెడీ అవడంతో రాహుల్ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేశాడట. ఇది వైశాలిని తీవ్రంగా భాదించినట్లు తెలుస్తోంది. కెన్యాలో పనిచేసే ఒక సర్జన్ తో వైశాలి నిశ్చితార్థం జరిగింది. అప్పటి నుంచి రాహుల్ వేధింపులు ఎక్కువయ్యాయి. దీనితో మానసిక వేదన భరించలేక బయటకి చెప్పుకోలేక వైశాలి సూసైడ్ చేసుకున్నట్లు ఇండోర్ ఎసిపి రెహమాన్ వివరించారు.
