మహేష్ మూవీ థియేటర్స్ లో చూసి రెండేళ్లవుతుంది. దీనితో సర్కారు వారి పాట విడుదల కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వాళ్ళ నిరీక్షణకు మరో మూడు వారాల్లో తెరపడనుంది. సర్కారు వారి పాట విడుదల సమయం దగ్గిరపడింది.

సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata new look poster) మూవీ నుండి కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ లో మహేష్ లుక్ కేక పుట్టిస్తుంది. రెండు చేతుల్లో తాళాల గుత్తులు పట్టుకొని రౌడీ మూకలపై మహేష్ విరుచుకుపడుతున్నారు. ఓ భారీ యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన సదరు పోస్టర్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. సర్కారు వారి పాట షూట్ పూర్తిగా కంప్లీట్ అయినట్లు తెలియజేసిన చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. 

షూటింగ్ పార్ట్ కంప్లీట్ కాగా శరవేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికే ట్రైలర్, టీజర్ కట్ రెడీ చేసినట్లు సమాచారం. ఇటీవల ఫ్యాన్స్ సర్కారు వారి పాట నిర్మాతలపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. సినిమాకు సరైన ప్రొమోషన్స్ నిర్వహించడం లేదని నెగిటివ్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. దీంతో సర్కారు వారి పాట(Sarkaru Vaari Paata) నిర్మాతలు జోరు పెంచారు. త్వరలో థర్డ్ సింగిల్ విడుదల చేసి, వెంటనే టీజర్, ట్రైలర్ విడుదల చేయనున్నారు. 

Scroll to load tweet…

దర్శకుడు పరుశురాం సర్కారు వారి పాట చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ (Mahesh Babu)రోల్ చాలా వైవిధ్యంగా డైరెక్టర్ క్రియేట్ చేశారట. మహేష్ లోని మాస్ యాంగిల్ బాగా ఎలివేట్ చేసినట్లు సమాచారం. ఇక బ్యాంకింగ్ వ్యవస్థ లోపాలు, ఆర్ధిక నేరాలు నేపథ్యంలో సర్కారు వారి పాట తెరకెక్కుతుంది. మే 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 

కీర్తి సురేష్(Keerthy Suresh) కెరీర్ లో మొదటిసారి మహేష్ తో జతకడుతున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. సర్కారు పాట నుండి రెండు సాంగ్స్ విడుదల చేశారు. ఫస్ట్ సింగిల్ కళావతి, సెకండ్ సింగిల్ పెన్నీ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ రాబడుతున్నాయి. పెన్నీ సాంగ్ లో మహేష్ కూతురు సితార కనిపించడం విశేషం. మొత్తంగా భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న సర్కారు వారి పాట ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం ఖాయమంటున్నారు.