సినిమా ఇండస్ట్రీలో పాపులర్ నటీనటులు కొన్ని ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంటారు. దీనికోసం వారికి భారీ రేంజ్ లో పారితోషికాలు ఇస్తుంటారు. ఆ సంగతి పక్కన పెడితే కొంతమంది తారలు ఇలా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి విమర్శలపాలయ్యారు. 

అందుకే చాలా మంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత 'కుర్ కురే' ప్రొడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ వ్యవహరిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

అంతే.. నెటిజన్లు ఆమెని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఆరోగ్యానికి హానికరమైన ప్రొడక్ట్ అని దయచేసి ఇలాంటి వాటికి సపోర్ట్ చేయొద్దని ట్వీట్ లు పెడుతున్నారు. కొందరు సమంతను రిక్వెస్ట్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం పరుష పదజాలంతో ఆమెని తిడుతున్నారు.

డబ్బు కోసం ఇలా చేస్తావా..? అంటూ మండిపడుతున్నారు. గతంలో మంచు లక్ష్మీ కూడా ఇలానే 'కుర్ కురే'కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి విమర్శలు ఎదుర్కొంది. అయితే వాటికి ఆమె ధీటైన సమాధానం చెప్పిందనుకోండి. మరి ఇప్పుడు సమంత ఈ విషయంలో ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి!