పొగాకు ఉత్పత్తులు, హాని చేసే ప్రాడక్ట్స్ ను ప్రమోట్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. టోబ్యాకో ఉత్పత్తులను ఎంకరేజ్ చేసే వారికి పద్మ శ్రీ ఎందుకంటూ.. Boycott Bollywood ఉద్యమాన్ని చేపట్టారు. 

బాలీవుడ్ స్టార్స్ సినిమాలను ఆడియెన్స్, నెటిజన్లు ఎంతలా ఎంకరేజ్ చేస్తారో.. అదే స్థాయిలో వారి యాడ్ ఫిల్మ్స్ పట్ల తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూడా ఖండిస్తున్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికన ‘బైకాట్ బాలీవుడ్’ (#Boycott Bollywood) పేరుతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభించారు. గతంలో దూమపానాని వ్యతిరేకంగా, శానిటరీ నాప్ కిన్స్ కొనుగోలు చేయాలంటూ ప్రజాహిత ప్రకటనలతో చలనచిత్ర ప్రదర్శనకు ముందుకు బిగ్ స్క్రీన్ పై మంచి మాటలు చెప్పాడు అక్షయ్ కుమార్. జనాల ప్రాణాలకు హాని చేసే ఎటువంట పొగాకు, టోబ్యాకో వంటి ప్రాడక్ట్స్ నను ఎంకరేజ్ చేయనని, అలాంటి యాడ్ ఫిల్మ్ లో నటించనని హామీనిచ్చారు. 

అయితే రీసెంట్ గా అక్షయ్ కుమార్ ఆ మాట తప్పారు. బాలీవుడ్‌ స్టార్స్‌ అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn), అక్షయ్ కుమార్, షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) పాన్‌ మసాలా యాడ్‌లో కలిసి నటించారు. ఆ యాడ్‌లో తమ అభిమాన హీరో అక్షయ్ కుమార్ కనిపించడంతో అభిమానులు తట్టుకోలేకపోయారు. ఇలాంటి ప్రకటనలో నటించడమేంటని మండిపడ్డారు. ఆరోగ్యానికి హాని చేసే ఉత్పత్తులను తానెప్పటికీ ప్రమోట్‌ చేయనని చెప్పి ఇప్పుడెందుకిలా చేస్తున్నాడని ఫైర్‌ అయ్యారు. ఇందుకు గురువారం రాత్రి జనాలకు హాని చేసే ప్రాడక్ట్స్ ను ప్రమోట్ చేసినందుకు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) తన అభిమానులు, ప్రేక్షకులు, జనాలకు క్షమాపణ చెబుతూ స్టేట్ మెంట్ రిలీజ్ చేశారు. 

కానీ ఇంకా, అజయ్ దేవగన్, షారుక్ ఖాన్ స్పందించకపోవడం పట్ల నెటిజన్లు, అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఈ మేరకు #Boycott Bollywood పేరుతో పొగాకు ఉత్పత్తులను ఎంకరేజ్ చేసేలా తీసుకుంటున్న బాలీవుడ్ స్టార్స్ నిర్ణయాలను ఖండించారు. ప్రజలకు హాని చేసే ప్రాడక్ట్స్ ను ప్రోత్సహిస్తున్న వీరికి ‘పద్మ శ్రీ అవార్డు’ (Padma Shri Award) ఎందుకని ప్రశ్నిస్తున్నారు. వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ప్రాడక్ట్స్ ను ప్రోత్సహించడాన్ని మానేయాలని సూచిస్తున్నారు. 

Scroll to load tweet…