యాంకర్ సుమ... ఈ పేరుకి పరిచయం అక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు అందరూ సుమకి అభిమానులే. సుమ పుట్టి పెరిగింది కేరళలో అయినా... అచ్చ తెలుగు అమ్మాయిలా మారిపోయి తెలుగు ప్రజలను మురిపిస్తున్నారు. యాంకరింగ్  లో తనకు ఎవరూ సాటి రారని నిరూపించారు. ఇప్పటి వరకు కనీసం నెగిటివిటీ అనేది లేకుండా ఆమె ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా... సుమపై నెటిజన్లు మండిపడుతున్నారు. నీలో ఇంత క్రూరత్వం ఉందా అని నెటిజన్లు సుమను ప్రశ్నిస్తుండటం గమనార్హం.

ఇంతకీ మ్యాటరేంటంటే... తనకు సంబంధించిన కొన్ని విష‌యాల‌ను సుమ ఎప్ప‌టిక‌ప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు. ఇక ఆమెకు మూగజీవులు అంటే ఇంకా ఇష్టం. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ ఆవు, దూడతో స‌రదాగా గ‌డిపిన వీడియోను పోస్టు చేసింది. ఇందులో రాముడు అంటూ ఆవు దూడ‌ను ప్రేమ‌గా ద‌గ్గ‌ర‌కు పిలుచుకుంటోంది. వీడియోలో దూడ మూతికి అడ్డంగా వెదురు బుట్టి లాంటిది పెట్టారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Suma K (@kanakalasuma)

అయితే ఇది కొంత‌మంది నెటిజ‌న్ల ఆగ్ర‌హానికి గురైంది. దూడ మూతిని పాలు తాగకుండా అలా కట్టేసారని ప్ర‌శ్నిస్తున్నారు. ఇంతటి క్రూరత్వం మీకు కనిపించడం లేదా అని సుమపై ఫైర్ అవుతున్నారు. కానీ మ‌రో వ‌ర్గం వారు.. దూడ ఏది పడితే అది తింటే ఆరోగ్యం చెడిపోతుందని, మోతాదుకు మించి ఎక్కువ పాలు తాగితే ప్రమాదకరమని, కాబట్టి అలా మూతికి అడ్డుకడతారని సుమ‌కు అండ‌గా నిలుస్తున్నారు.