సెలబ్రిటీలకు సోషల్ మేడియా వేధింపులు సర్వసాధారణం. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని సులభంగా తెలియజేసే వెసులుబాటు సోషల్ మీడియా ద్వారా కలిగింది. ఐతే ఈ పరిణామం వేధింపులకు కూడా కారణం అవుతుంది. విషయంలోకి వెళితే హీరోయిన్ తాప్సి నటిస్తున్న రష్మీ రాకెట్ మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆమె అథ్లెట్ రోల్ చేస్తున్నారు. 

కాగా ఈ మూవీ వర్కింగ్ స్టిల్స్ తాప్సి సోషల్ మీడియాలో పంచుకోగా ఓ నెటిజెన్స్ నెగెటివ్ కామెంట్స్ చేశాడు.  'నీకు యాక్టింగ్ రాదు, ఎత్తుకొని ఎత్తుకొని సినిమాలు చేస్తావు, నువ్వొక ఫాల్తూ హీరోయిన్' అని కామెంట్ పెట్టాడు. ఎంపిక చేసుకొన్న సినిమాలు మాత్రమే చేయగలవు, అన్ని రకాల పాత్రలు చేయడం నీకు రాదన్న అర్ధంలో ఆ నెటిజెన్ కామెంట్ పెట్టారు. 

సదరు నెటిజన్ కామెంట్ కి స్పందించిన తాప్సి 'ఏం ఎత్తుకొని సినిమాలు చేస్తున్నాను, నా ఇమేజ్ ఎత్తుకున్నాను, అది నీకు తెలియడం లేదు' అని రిప్లై ఇచ్చింది. కొంత కాలంగా తాప్సి బాలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ కెరీర్ లో ముందుకు వెళుతున్నారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం తాప్సి కెరీర్ సక్సెస్ ఫుల్ ట్రాక్ లో ఉంది.