ఇచ్చేవాడు ఉండాలే కానీ అడిగేవాడి కోరికలకు అంతుండదు అనడానికి తాజా సంఘటనే నిదర్శనం. అడిగిందే తడవుగా సహాయం చేస్తూ కలియుగ కర్ణుడు అయ్యాడు సోనూసూద్. ఇప్పటికే వందల మందికి సోనూ సూద్ సహాయం చేయడం జరిగింది. సోషల్ మీడియాలో రిక్వెస్ట్ పెట్టినా చాలు సోనూ సూద్ ఇబ్బందులలో ఉన్నవారిని వెంటనే ఆదుకుంటున్నారు. 

ఈ క్రమంలో కొందరు సోనూ సూద్ ని వింత వింత కోరికలు కూడా కోరుతున్నారు. ఐతే సోను సూద్ వాటికి సహనంగా తన శైలిలో సమాధానాలు ఇస్తున్నారు. తాజాగా ఓ నెటిజెన్ సోను సూద్ ని గొంతెమ్మ కోరిక అడిగాడు. బాలీవుడ్ బాద్షా ఈనెల 2న తన 55వ జన్మదినం జరుపుకున్నారు. షారుక్ గౌరవార్దం ప్రఖ్యాత బూర్జ్ ఖలీఫా టవర్ ద్వారా బెస్ట్ విషెస్ తెలియజేశారు. 

సదరు ఫోటో షేర్ చేసిన నెటిజెన్ తనకు కూడా ఆ తరహా బర్త్ డే సెలెబ్రేషన్స్ కావాలని, నవంబర్ 5న తన బర్త్ డే నాడు బూర్జ్ ఖాలిఫా పై తన పేరు రాయాలని, ఆ ఏర్పాట్లకు సహాయం చేయాలని కోరుకున్నాడు. దీనికి సమాధానంగా సోనూ సూద్..'బ్రదర్ నీ బర్త్ డే మూడు రోజలు లేటయ్యింది. కష్టపడి పేరు ప్రఖ్యాతులు సంపాదించు అప్పుడు నీ పేరు బూర్జ్ ఖలీఫా కాదు, ఈ ప్రపంచం ఆకాశంలో రాస్తుంది' అన్నారు. సూను సూద్ ఎపిక్ రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.