యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ మరోసారి సౌత్ లో హాట్ టాపిక్ అయ్యాడు. ప్రస్తుతం దిలీప్ కుమార్.. స్టార్ హీరో విజయ్ తో బీస్ట్ అనే హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నారు.

యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ మరోసారి సౌత్ లో హాట్ టాపిక్ అయ్యాడు. ప్రస్తుతం దిలీప్ కుమార్.. స్టార్ హీరో విజయ్ తో బీస్ట్ అనే హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ సూపర్ స్టార్ రజనీకాంత్ ని డైరెక్టర్ చేసే ఛాన్స్ దక్కించుకోవడం ఆసక్తిగా మారింది. 

వరుసగా విజయ్, రజనీకాంత్ లతో సినిమాలు చేసే అవకాశం రావడం అంటే మామూలు విషయం కాదు. నెల్సన్ కి ఈ స్థాయి అలా చిటికెలో వచ్చేయలేదు. కోలీవుడ్ లో ఏళ్లతరబడి పడుతూ లేస్తూ ఈ స్థాయికి చేరుకున్నాడు. 

2010లోనే నెల్సన్ దర్శకుడిగా మారాల్సింది. శింబు హీరోగా నెల్సన్ దర్శకత్వంలో అనౌన్సమెంట్ కూడా జరిగింది. కానీ దురదృష్టవశాత్తూ ఆ చిత్రం ఆగిపోయింది. దీనితో నెల్సన్ దర్శకుడిగా మారేందుకు మరో ఆరేళ్లపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. 2018లో నెల్సన్.. నయనతార ప్రధాన పాత్రలో 'కొలమావు కోకిల' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ మూవీ మంచి విజయం సాధించింది. 

అనంతరం శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కించిన డాక్టర్ మూవీ కూడా ఘనవిజయం సొంతం చేసుకుంది. ఇలా నెల్సన్ వచ్చిన ప్రతి ఛాన్స్ ని ఉపయగించుకుంటూ ముందుకెళుతున్నారు. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న బీస్ట్ మూవీ త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇంతలోనే నెల్సన్ సూపర్ స్టార్ రజనీకాంత్ తో పోజెక్టు ఖరారు చేసుకున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. చాలా కాలంగా విజయం కోసం ఎదురుచూస్తున్న రజనీ కూడా ఈ యువ దర్శకుడిపై నమ్మకం ఉంచారు. ఏది ఏమైనా కెరీర్ లో పడుతూ లేస్తూ ఎదిగిన నెల్సన్ కి ప్రశంసలు దక్కుతున్నాయి.