టాలీవుడ్ లో వచ్చిన 'RX 100' సినిమా ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో హీరోయిన్ విలన్ క్యారెక్టర్ పోషించడం యూత్ ని బాగా ఆకట్టుకుంది. అమ్మాయిలో నెగెటివ్ షేడ్స్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడంతో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. 

ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో ఇదే తరహాలో చాలా సినిమాలొచ్చాయి. కానీ హిట్ అయిన దాఖలాలు లేవు. తాజాగా మరో సినిమా 'RX 100' సినిమా పాయింట్ ఆధారంగానే తెరకెక్కిస్తున్నారు. అదే 'నేను లేను'. అందరూ కొత్తవారితో తెరకెక్కిస్తోన్న ఈ సినిమా టీజర్ ని తాజాగా విడుదల చేసింది చిత్రబృందం.

బోల్డ్ గా కట్ చేసిన టీజర్ ని బట్టి సినిమా ఎలా ఉండబోతుందో చెప్పే ప్రయత్నం చేశారు. 'RX 100' మాదిరి ఈ సినిమాలో కూడా విలన్ హీరోయినే.. ఆమెని పిచ్చిగా ప్రేమించిన అబ్బాయిని తన అవసరాల కోసం వాడుకొని వదిలేస్తుంది.

దీంతో ఆమెపై ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడనేదే ఈ సినిమా కథ. మరి 'RX 100' ని ఫాలో అవుతున్న ఈ సినిమా ఆ రేంజ్ సక్సెస్ అందుకుంటుందా..? లేక చతికిల పడుతుందో..? చూడాలి!