అల్లు అర్జున్ తో ఛాన్స్ ఎప్పుడు వస్తుందో, ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ సూపర్.. పెద్ద హీరోలకు నేహా శెట్టి గాలం
యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది.ప్రస్తుతం నేహా శెట్టి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న హీరోయిన్. నేహా శెట్టి ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది.

యంగ్ బ్యూటీ నేహా శెట్టి రచ్చ సోషల్ మీడియాలో రోజు రోజుకి ఎక్కువవుతోంది.ప్రస్తుతం నేహా శెట్టి సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్న హీరోయిన్. నేహా శెట్టి ప్రస్తుతం వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. సిద్దు జొన్నలగడ్డతో కలసి డీజే టిల్లు చిత్రంలో మంచి కెమిస్ట్రీ పండించింది. లిప్ కిస్సులతో మోత మోగించింది. దీనితో యువత అంతా ఆమెకి ఫ్యాన్స్ గా మారిపోయారు. డీజే టిల్లు చిత్రం విజయం సాధించడంతో.. ఆ సక్సెస్ ని క్యాష్ చేసుకునే పనిలో ఉంది నేహా శెట్టి.
ఇటీవల బెదురులంక చిత్రంతో ఆకట్టుకున్న నేహా శెట్టి త్వరలో రూల్స్ రంజన్ అనే చిత్రంతో అలరించబోతోంది. కిరణ్ అబ్బవరం సరసన నటించిన రూల్స్ రంజన్ చిత్రంలోని సమ్మోహనుడా సాంగ్ యూట్యూబ్ ని షేక్ చేస్తూ దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కుర్రాళ్ళు పండగ చేసుకునే విధంగానే నేహా శెట్టి అందాలు ఒలకబోసింది.
అక్టోబర్ 6న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండడంతో ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. చిన్నతనంలోనే తనకి సినిమాలంటే పిచ్చి ఏర్పడింది అని నేహా తెలిపింది. 2014లో మిస్ మంగుళూరు కిరీటం దక్కించుకున్నా. ఆ తర్వాత మెహబూబా చిత్రంలో నటించేందుకు పూరీజగన్నాధ్ నుంచి పిలుపు వచ్చింది. ఆ తర్వాత డీజే టిల్లు లో అవకాశం రావడం, ఆ చిత్రంతో గుర్తింపు పొందడం జరిగింది అని తెలిపింది.
ఆలు అర్జున్ గారితో ఓ యాడ్ లో నటించా. ఆయనతో సినిమాలో నటించే ఛాన్స్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నా. అలాగే ఎన్టీఆర్ నటన అంటే కూడా చాలా ఇష్టం ఆయన డైలాగ్ డెలివరీ సూపర్బ్ అనే చెప్పాలి అంటూ నేహా శెట్టి ప్రశంసలు కురిపించింది.