శంకరా.. ఇది అతి అనిపించడం లేదా?

negative publicity on shambho shankara movie
Highlights

జబర్దస్త్ షోతో పాపులర్ అయిన షకలక శంకర్ కమెడియన్ గా పలు సినిమాలలో అవకాశాలు దక్కించుకున్నాడు

జబర్దస్త్ షోతో పాపులర్ అయిన షకలక శంకర్ కమెడియన్ గా పలు సినిమాలలో అవకాశాలు దక్కించుకున్నాడు. ఇప్పుడు హీరోగా మారి 'శంభో శంకర' సినిమా చేశాడు. ఈ వారమే సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హీరోగా ఛాన్స్ కోసం శంకర్ చాలానే కష్టపడ్డాడు. తన దగ్గరున్న స్క్రిప్ట్ పట్టుకొని చాలా చోట్ల తిరిగాడు. దిల్ రాజు, త్రివిక్రమ్, రవితేజ ఇలా చాలా మందిని కలిసి తనను హీరోగా పెట్టి సినిమా చేయమని అడిగాడట.

ఈ విషయాన్ని స్వయంగా షకలక శంకర్ వెల్లడించారు. అయితే ఏ ఒక్కరు కూడా సినిమా నిర్మించడానికి ముందుకు రాలేదు. రవితేజ అయితే ఇప్పుడు హీరోగా చేయాల్సిన అవసరం ఏముందని క్లాస్ కూడా తీసుకున్నాడట. అయినా.. కథపై నమ్మకంతో సినిమా చేశానని చెప్పుకొచ్చాడు. సాధారణంగా సినిమా హిట్ అయిన తరువాత రిజెక్షన్ల గురించి మాట్లాడితే బాగుంటుంది. కానీ శంకర్ మాత్రం ముందే రిజెక్షన్ లిస్ట్ చెబుతుండడంతో ఇది సినిమా నెగెటివ్ పబ్లిసిటీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటికే పలు ప్రైవేట్ ఈవెంట్స్ లో శంకర్ తన నోటికొచ్చినట్లు మాట్లాడుతుండడం కొందరికి సహించడం లేదు.

పైగా ఆఫ్ స్క్రీన్ లో తను కాబోయే మెగాస్టార్ అంటూ సన్నిహితుల వద్ద చెబుతున్నాడట. మీరెవరూ ఉద్యోగాలు చేయక్కర్లేదు.. మిమ్మల్ని నేను చూసుకుంటా అంటూ గొప్పలు పోతున్నాడని సమాచారం. తిండిలేక సన్నబడ్డానని చెప్పడంలో నిజం లేదని, బరువు తగ్గడం కోసం ఒక విధమైన డైట్ చేశాడని.. సినిమా పబ్లిసిటీ కోసం ఇలాంటి మాటలు చెబుతూ అభాసుపాలవుతున్నాడని అంటున్నారు. 
 

loader