Asianet News TeluguAsianet News Telugu

నీతోనే డాన్స్ 2.0 విన్నర్స్ ఎవరో తెలుసా? 

బిగ్ బాస్ టైటిల్ మిస్ అయినా ..  పట్టు వదలని విక్రమార్కుడిలా అమర్  కష్టపడ్డాడు. నీతోనే డాన్స్ 2.0 లో తన భార్య తేజస్విని తో కలిసి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. ఫినాలే లో అందరికంటే ఎక్కువ మార్కులు సాధించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. 

neethone dance these constant got title ksr
Author
First Published Jun 25, 2024, 12:10 AM IST


నీతోనే డాన్స్ 2.0 విన్నర్ గా నిలిచి అమర్ దీప్ సంచలనం సృష్టించాడు. గత ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో అమర్ దీప్ - తేజస్విని ట్రోఫీ గెలుచుకున్నారు. దీంతో పాటు వారికి 15 లక్షల ప్రైజ్ మనీ కూడా అందుకున్నారు. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన అమర్ సత్తా చాటాడు. ఊహించని విధంగా విన్నర్ గా నిలిచాడు. అతన్ని అవహేళన చేసిన వారికి తన గెలుపుతో గట్టిగా బుద్ధి చెప్పాడు. 

నిజానికి అమర్ దీప్ నీతోనే డాన్స్ సీజన్ 1లో చాలా కష్టపడ్డాడు. ఫైనల్ వరకు వచ్చాడు. కానీ ఆఖరి నిమిషంలో సందీప్ మాస్టర్ - జ్యోతి విన్నర్ అయ్యారు. అమర్ - తేజు రన్నర్ గా నిలిచారు.  ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 7 లో ఎలాగైనా కప్పు తోనే ఇంటికి పోతా అంటూ అమర్ దీప్ ఛాలెంజ్ చేశాడు. కానీ శివాజీ డామినేషన్ వల్ల అమర్ వెనుకబడ్డాడు. ప్రతిసారి శివాజీ, అమర్ దీప్ ని చులకన చేసి మాట్లాడటం. వీడు ఎందుకు పనికిరాడు అంటూ నానా మాటలు అనేవాడు. 

బిగ్ బాస్ టైటిల్ మిస్ అయినా ..  పట్టు వదలని విక్రమార్కుడిలా అమర్  కష్టపడ్డాడు. నీతోనే డాన్స్ 2.0 లో తన భార్య తేజస్విని తో కలిసి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చాడు. ఫినాలే లో అందరికంటే ఎక్కువ మార్కులు సాధించి టైటిల్ సొంతం చేసుకున్నాడు. ఒక్కసారి మిస్ అయిన టైటిల్ ఇప్పుడు నీ సొంతం అయింది. ఎలా అనిపిస్తుంది అమర్ అంటూ యాంకర్ శ్రీముఖి అడిగింది. దీంతో అమర్ ఎమోషనల్ అయ్యాడు. 

అమర్ మాట్లాడుతూ .. నీతోనే డాన్స్ .. బిగ్ బాస్ టైటిల్ మిస్ అయింది. ఇప్పుడు నీతోనే డాన్స్ 2.0, ఈ ట్రోఫీ మా మాస్టర్ కి అంకితం చేస్తున్న. నేను ఈ రోజు ఇక్కడ వరకు వచ్చానంటే .. ఒక నటుడిగా మంచి పేరు వచ్చింది అంటే అది మానస్ వల్లే. నా నిజమైన స్నేహితుడు. ఈ ట్రోఫీ ని వాడితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నా అంటూ అమర్ చెప్పుకొచ్చాడు. ఇక అమర్ దీప్ - తేజు విన్నర్ కాగా విశ్వ - నయని పావని  రన్నర్ గా నిలిచారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios