Asianet News TeluguAsianet News Telugu

Prema Entha Madhuram: అసలు నిజాన్ని బయటపెట్టిన నీరజ్.. ఆశ్చర్యం లో అంజలి!

Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కథ కథనాలతో ప్రేక్షకుల మనసు దోచుకుంటుంది. సీరియల్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది. ఇక ఈరోజు మార్చి 17వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Neeraj reveals shocking truth to everyone in prema entha madhuram serial gnr
Author
First Published Mar 17, 2023, 7:29 AM IST

ఎపిసోడ్ ప్రారంభంలో అను, ఆర్యలు ప్రమాదం జరిగిన స్థలం నుంచి బయటకు వచ్చేస్తారు. తర్వాత ఆర్యకు అను ఏడుస్తూ తడి బట్టతో ఒళ్లంతా తుడుస్తూ  ఉంటుంది.అను ఏడవడం చూసి ఆర్య బాధపడతాడు మన చేతిలో ఏమీ ఉండదు కదా నువ్వు బాధపడొద్దు ఏం రాసున్నదో అదే జరుగుతుంది. అయినా అలా జరగకపోయి ఉంటే నా భార్యతో ఇలా తుడిపించుకునే అవకాశం నాకు రాదు కదా అని అంటాడు.

దానికి అను నవ్వుతుంది.అయ్యో మర్చిపోయాను బామ్మ వెన్నపూస ఇస్తానన్నది రాస్తే చల్లగ ఉంటుంది అంటూ బయటకు వెళ్ళగా అక్కడ అంజలి కనిపిస్తుంది. అను, అంజలి వస్తుంది అని ఆర్య కి చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది. ఇంతలో అంజలి లోపలికి వచ్చి ఏంటి ఆనంద్ అంత ప్రమాదం జరిగింది, చెప్పనేలేదు నాకు విషయం తెలిసిన వెంటనే నువ్వు ఎలా ఉన్నావో అని పరిగెట్టుకుంటూ వచ్చేసాను.

 ఇప్పుడు బానే ఉన్నావు కదా అని అనగా బానే ఉన్నాను అని ఆర్య అంటాడు.సరే అయితే నేను బయలుదేరుతాను రేపు హోలీ కదా అందరూ కలిసి జరుపుకుందాము.మీ బస్తి దగ్గరకి నేను రేపు ఉదయాన్నే వస్తాను  అంటుంది అంజలి. ఆమె వెళ్ళిపోయిన తర్వాత అను తిరిగి వస్తుంది. ఇంతలో అంజలి కార్ తాళాలు మర్చిపోయి లోపలికి వస్తుంది.

 లోపలికి వచ్చి తిరిగి వెళుతున్న దారిలో అను కనిపిస్తుంది.నువ్వు ఇక్కడున్నావేంటి అని అనగా కంగారుపడి మాది కూడా ఈ పక్క సందే మేడం ఇక్కడే ఉంటున్నాను  అంటుంది అను.అప్పుడు అంజలి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.ఆ తర్వాత రోజు ఉదయం అను తయారై కూర్చుంటుంది ఆర్య ఇంత త్వరగా తయారయ్యావ్ ఏమి అయినా ముఖానికి కాటుక లేదు ఎందుకు అంటాడు ఆర్య.

 బద్దకంగా ఉంది సార్ మీరే పెట్టండి అని అంటుంది.అప్పుడు ఆర్య కాటుక పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉండగా అను రెప్పలు కొడుతూ ఉంటుంది అప్పుడు ఆర్య అను చెంప  మీద ముద్దు పెట్టగా అను ఆశ్చర్య పోతుంది.వెంటనే కాటుక పెట్టేస్తాడు ఆర్య నీకే కాదు నాకు కూడా వంకర దారిలో వెళ్లి గెలవడం తెలుసు అంటాడు. ఇంతలో బయట ఉన్న పిల్లలు ఆర్య మీద రంగుల జల్లుతారు.

 దాన్ని చూసి అను  నవ్వుతుంది ఆర్య కోపంగా పిల్లలు వైపు చూస్తాడు. వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు హోలీ శుభాకాంక్షలు అను అని చెప్పి తర్వాత అను కడుపు దగ్గరికి వెళ్లి హలో జూనియర్ వచ్చే సంవత్సరం మన ముగ్గురం కలిసి హాయిగా హోలీ జరుపుకుందాము వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి ముద్దు పెట్టుకుంటాడు. మరోవైపు ఇంట్లో శారదమ్మ దగ్గరికి వెళ్లిన నీరజ్ హోలీ శుభాకాంక్షలు అని స్వీట్ ఇస్తాడు.

 వద్దు నీరజ్ మనసుకు లేని ఆనందం మాటకి వద్దు నా కొడుకుని అంత దూరంగా చూస్తూ నేను ఉండలేకపోతున్నాను అని అంటుంది. అప్పుడు నీరజ్ అమ్మ అంజలి మనల్ని హోలీ కి రమ్మని చెప్పింది అందరూ అక్కడే సెలబ్రేట్ చేసుకుందామన్నది దాదా వదినలు కూడా ఉంటారు రా అని అనగా వద్దు నా సొంత కొడుకుని నేను పరాయి మనిషిలా కలుసుకోవడం నాకు ఇబ్బందిగా ఉన్నది,నచ్చడం లేదు అని అంటుంది.

 అయితే నువ్వు రా మాన్సీ అని అనగా నేను అసలు రాలేను బాబోయ్ నాకు పనులున్నాయి అని చెప్పి మాన్సీ మెట్లు ఎక్కబోతూ ఉండగా అసలుకే అంజలి బ్రో ఇన్ లా, అనుని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది ఇప్పుడు వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలని తెలిస్తే ఇంకా నెత్తిన పెట్టుకుంటుంది.ఆ విషయం తెలియకుండా చూడాలి అనుకుని మళ్ళీ కిందకి వచ్చి నేను వస్తాను నీరజ్.

పాపం అంజలి అంత ప్రేమగా పిలిచింది కదా రాకపోతే బాగోదు అంటుంది. ఇద్దరూ  బయలుదేరుతారు.  అక్కడికి వెళ్లిన తర్వాత అంజలి వాళ్ళిద్దరినీ ఆహ్వానిస్తుంది. ఇంతలో ఒక చిన్న కుర్రాడు దేవుడికి దండ వేద్దామని వచ్చి కాలుజారి ఆ దండ ఆర్య అను ల మెడలో వేసేస్తాడు. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ సీతారాములే మా కళ్ళ ఎదుట ఉన్నారు.

అన్యోన్య దంపతులు అని అనగా మాటకు అంజలి ఆశ్చర్యపోయి ముందుకు వెళ్లి మీరిద్దరూ భార్యాభర్తల ఈ విషయం నాకెందుకు చెప్పలేదు ఆనంద్ అని అడుగుతుంది. అప్పుడు నీరజ్ అక్కడికి వచ్చి ఆనంద్ కాదు ఆర్య వర్ధన్ వన్ అండ్ ఓన్లీ గ్రేట్ బిజినెస్ మాన్ అండ్ తను అప్పు కాదు మిస్సెస్ అనురాధ ఆర్య వర్ధన్ వీళ్ళిద్దరూ మా దాదా,వదినలు అని అంటాడు.

 ఆశ్చర్యంలో ఉన్న అంజలి అలాంటి గొప్ప వ్యక్తి నా దగ్గర వర్క్ చేయడం ఏంటి అని అనగా తండ్రి మాట కోసం రాముడు వనమాసం చేస్తే తమ్ముడు మాట కోసం ఈ రాముడు అజ్ఞాతవాసానికి వచ్చాడు అని బాధగా చెప్తాడు నీరజ్. అక్కడున్నవాళ్లంతా మిమ్మల్ని దేవుడితో పోలుస్తాం కానీ మీరే దేవుడు అని ఇప్పుడే తెలుస్తుంది అని పొగుడుతారు. అక్కడ జరిగిన దృశ్యం అంతా చూస్తున్న మాన్సీ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం

Follow Us:
Download App:
  • android
  • ios