మొత్తానికి తరుణ్ భాస్కర్ ...టీవి షో ను హోస్ట్ చేయటానికి సిద్దపడ్డారు. ఈటీవి ప్లస్ లో నీకు మాత్రమే చెప్తా అనే పేరుతో ఈ షోని నిర్వహించనున్నారు. ప్రముఖ దర్శక,నిర్మాత కరణ్ జోహార్...బాలీవుడ్ సెలబ్రెటీలు అందరినీ తీసుకొచ్చి.. 'కాఫీ విత్ కరణ్',   పేరుతో ఓ షో చేసారు. ఆ షో పెద్ద హిట్టైంది. ఈ షోలో సెలబ్రెటీల పర్శనల్ విషయాల ప్రస్దావన తీసుకొచ్చి, ఫన్ తో ఆ షో ని విజయవంతంగా నడిపే ప్రయత్నం చేసారు.  ఇప్పుడు ఇలాంటి షోనే తరణ్ భాస్కర్ చేయబోతున్నారని సమాచారం. నీకు మాత్రమే చెప్తా షో ...మార్చి 14 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రెటీలతో ఇంటర్వూలు మొదలెట్టేసారట. ఇందులో కొన్ని వివాదాస్పద విషయాలు, మసాలా ఖచ్చితంగా ఉంటాయి. 

ఈ నేపధ్యంలో  ఇంతకు ముందు హిందీలో 'కాఫీ విత్ కరణ్'.. 'నో ఫిల్టర్ విత్ నేహ' లాంటి బోల్డ్ చాట్ షో ల తరహాలో తెలుగులో 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్' షో స్టార్ట్ వచ్చిందన్న విషయం అందరూ గుర్తు చేసుకుంటున్నారు.  ఈ షోకు డైనమిక్ లేడీ మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరించింది.  ఈ షో ఎంత బోల్డ్ గా ఉంటుందో ప్రోమోస్ లోనే అందరికీ తెలిసిపోవటంతో మంచి క్యూరియాసిటీ ఏర్పడింది.   ఈ చాట్ షో కు స్టార్ హీరోయిన్ సమంతా అతిథిగా హాజరైన ఎపిసోడ్ ను స్ట్రీమింగ్ చేశారు.  అంతే.. ఒక సంచలనం నమోదైంది. 

అయితే ఆ తర్వాత ఆ షో మెల్లిగా చప్పబడింది. తమ నిజ జీవిత సీక్రెట్ బయిటకు తెస్తాననటంతో...స్టార్స్ ఈ షోకు రావటానికి ఉత్సాహం చూపించలేదని తెలిసింది. ఇప్పుడు తరణ్ భాస్కర్ షోకు మరి ఏ సెలబ్రెటీలను తీసుకొస్తాడో చూడాలి. సరదాగా,ఫన్నీగా ఉండే ప్రశ్నలు అయితే ఓకే కానీ రూమర్స్ ని బేస్ చేసుకుని క్వచ్చిన్స్ అడగద్దని సెలబ్రెటీలు కోరుతున్నారట. అలాగే తమ జీవిత సీక్రెట్స్ ని వెల్లడించటానికి ..బాలీవుడ్ మాదిరి ఇక్కడెవరు ఉత్సాహం చూపిస్తారో చూడాలి.

సినీ కెరీర్ విషయానికి వస్తే...

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ వచ్చిన  `పెళ్లిచూపులు`తో  తరుణ్‌భాస్క‌ర్ పేరు ఒక్కసారిగా మారు మ్రోగిపోయింది. ఈ సినిమాతో తరుణ్ కు అభిమానులు సైతం ఏర్పడ్డారు. ద‌ర్శ‌కుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపుని సొంతం చేసుకున్నారు. ఇండిపెండెంట్ ఫిల్మ్ మేక‌ర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్క‌ర్ ఆ త‌రువాత `ఈ న‌గ‌రానికి ఏమైంది?` చిత్రాన్ని రూపొందించారు. ఆ  సినిమా బాక్సాఫీస్ డిజాస్టర్ అయ్యింది. దాంతో ద‌ర్శ‌కుడిగా గ్యాప్ తీసుకుని నటుడుగా సినిమా చేసాడు.

`మీకు మాత్ర‌మే చెప్తా` అంటూ తన నటనతో  ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. విజ‌య్ దేవ‌ర‌కొండ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించిన ఈ చిత్రం ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. ఈ నేపధ్యంలో త‌రుణ్ భాస్క‌ర్ వాట్ నెక్ట్స్ అనే ప్ర‌శ్న‌లు మొద‌ల‌ైంది. మరో ప్రక్క తరుణ్ అతి త్వ‌ర‌లో భారీ చిత్రాన్ని చేయ‌బోతున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అందులో వెంక‌టేష్ హీరోగా న‌టించే అవ‌కాశం వుంద‌ని వార్త‌లు వినిపించాయి.