లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజీ చిత్రాలతో దూసుకుపోతోంది. అటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, ఇటు గ్లామర్ రోల్స్ తో నయనతారకు భారీ చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. ఇక నయనతార కెరీర్ లో ప్రేమ వ్యవహారాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. స్టార్ హీరో శింబుతో కొంత కాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగిన నయన్, ఆ తర్వాత ప్రభుదేవాతో కూడా ప్రేమాయణం సాగించింది. ఆ రెండు ప్రేమ కథలు పెళ్లి వరకు వెళ్ళలేదు. 

ప్రస్తుతం నయనతార తమిళ యువదర్శకుడు విగ్నేష్ శివన్ తో ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కు కొద్దిగా గ్యాప్ దొరికితే వీరిద్దరూ విదేశాలకు వెకేషన్ కు ఎగిరిపోతున్నారు. ప్రస్తుతం ఈ ప్రేమ జంట గ్రీస్ లోని ఏథెన్స్ లో విహరిస్తోంది. ఏథెన్స్ లో విగ్నేష్ శివన్, నయనతార ఫోటో ఒకటి నెటిజన్లని విశేషంగా కట్టుకుంటోంది. 

నయనతార అదిరిపోయే గ్లామర్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఇక విగ్నేష్ శివన్ నయనతార వెనుక అద్దంలో ప్రతిబింబంలో కనిపిస్తున్నాడు. ఈ ఫోటోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ పెడుతున్నారు. పెళ్లెప్పుడు చేసుకోబోతున్నారు.. కనీసం ఈసారైనా శుభవార్తతో తిరిగివస్తారా అంటూ నయన్, విగ్నేష్ జంటపై అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.